Actor Darshan: జైలులో కంపు భరించలేకపోతున్నా.. జడ్జీని వింత కోరిక కోరిన హీరో దర్శన్.. చివరకు..
రేణుకస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతనికి బెయిల్ వచ్చింది. అయితే సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది దీంతో దర్శన్ మళ్లీ జైలు పాలయ్యాడు. ప్రస్తుతం అతన్ని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. అయితే అక్కడి కఠినమైన నిబంధనలతో హీరో తెగ ఇబ్బంది పడుతున్నాడు.

రేణుక స్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు ఈసారి జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదు. దీంతో ఈ హీరో ఇప్పుడు జైలులో పడరాని పాట్లు పడుతున్నారు. రేణుకస్వామి హత్య కేసులో దర్శన్ గత సంవత్సరం అరెస్టయ్యాడు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టు నటుడి బెయిల్‌ను రద్దు చేసింది. అలాగే జైలులో అతనికి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంచారు. కోర్టు ఆదేశాల అనుసారం అతనికి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో ఒకప్పుడు స్టార్ హీరోగా లగ్జరీ లైఫ్ అనుభవించిన దర్శన్ ఇప్పుడు ఓ సామాన్య ఖైదీగా జైలులో మగ్గుతున్నాడు.
కాగా దర్శన్ బెంగళూరులోని 57వ CCH కోర్టులో అదనపు దిండు, బెడ్‌షీట్ కోసం దరఖాస్తు దాఖలు చేశారు. ఈ దరఖాస్తు మంగళవారం (సెప్టెంబర్ 09) విచారణకు వచ్చింది. ఈ సమయంలో, దర్శన్ వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత, అతను మొదట చేయి పైకెత్తి, ‘నాకు ఒక రిక్వెస్ట్ ఉంది సార్’ అని అడిగాడు. దీనికి స్పందించిన జడ్జీ ఏమిటని నటుడిని అడిగారు. అప్పుడు దర్శన్ ఇచ్చిన సమాధానం న్యాయమూర్తితో పాటు అందరినీ షాక్‌కు గురిచేసింది.
‘సూర్యోదయాన్ని చూసి నెల రోజులకు పైనే అవుతుంది. ఎండ అన్నది చూడడం లేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం అత్యంత దుర్భరంగా తయారైంది’ అని దర్శన్ న్యాయమూర్తి విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. ‘అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు. మీ గురించి జైలు అధికారులకు మేము ఇవ్వాల్సిన ఆదేశాలు ఇస్తాం’ అని చెప్పి విచారణను వాయిదా వేశారు న్యాయ మూర్తి
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








