AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan: జైలులో దర్శన్‌కు రాజ భోగాలు! దర్జాగా సిగరెట్ తాగుతూ కనిపించిన కన్నడ స్టార్ హీరో.. ఫొటో వైరల్

రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసిన చేసులో సుమారు రెండు నెలలుగా జైలులో ఉంటున్నాడు న్నడ స్టార్ హీరో దర్శన్. పరప్పన అగ్రహారంలోని ప్రత్యేక బ్యారక్‌లో అతనిని రిమాండ్ ఖైదీగా ఉంటారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. కాగా సినిమాల్లో హీరోగా బయట ఉన్నప్పుడు లగ్జరీ జీవితం గడిపాడు దర్శన్. రాజ భోగాలు అనుభవించాడు దర్శన్.

Darshan: జైలులో దర్శన్‌కు రాజ భోగాలు! దర్జాగా సిగరెట్ తాగుతూ కనిపించిన కన్నడ స్టార్ హీరో.. ఫొటో వైరల్
Actor Darshan
Basha Shek
|

Updated on: Aug 25, 2024 | 5:20 PM

Share

రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసిన చేసులో సుమారు రెండు నెలలుగా జైలులో ఉంటున్నాడు న్నడ స్టార్ హీరో దర్శన్. పరప్పన అగ్రహారంలోని ప్రత్యేక బ్యారక్‌లో అతనిని రిమాండ్ ఖైదీగా ఉంటారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. కాగా సినిమాల్లో హీరోగా బయట ఉన్నప్పుడు లగ్జరీ జీవితం గడిపాడు దర్శన్. రాజ భోగాలు అనుభవించాడు దర్శన్. అయితే జైలు కెళ్లిన తర్వాత బాగా కుంగిపోయాడీ ఛాలెంజింగ్ స్టార్. అనారోగ్యానికి గురయ్యాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని తెలుస్తోంది. హీరో దర్శన్ కు జైలులోనూ అన్ని సౌకర్యాలు అందుతున్నాయని తెలుస్తోంది. తాజాగా అతనికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అందులో కాఫీని ఆస్వాదిస్తూ, సిగరెట్ తాగుతూ కనిపించాడీ కన్నడీ హీరో. దర్శన్ ప్రత్యేక బ్యారక్ నుండి బయటకు వచ్చి మరో ముగ్గురితో కూర్చుని కబుర్లు చెబుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు జైలులో దర్శన్ కు ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అఅలాగే జైలు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్, అతని గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా రకాల సాక్షులు దొరికారు. మరికొద్ది రోజుల్లో పోలీసులు చార్జిషీటును సమర్పించనున్నారు. ఈ దశలోనే దర్శన్ ఫోటో వైరల్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా జైల్లో దర్శన్ గుండు కొట్టించుకున్నాడని వినికిడి. ఇప్పటికే పలువురు జైలును సందర్శించి దర్శన్‌ను కలిశారు. పోలీసుల విచారణలో వాంగ్మూలం ఇవ్వడంతో నటుడు చిక్కన్న కూడా జైలుకు వెళ్లి దర్శన్‌తో మాట్లాడారు. కాబట్టి వీరికి మళ్లీ పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు దర్శన్ ఏ2గా ఉన్నారు. అయితే ఛార్జిషీటు సమర్పించే దశలో ఆయనను ఏ1గా మార్చే అవకాశాలున్నట్లు కూడా సమాచారం. మరోవైపు జైలులో ఉన్న తమ హీరో విడుదల కావాలని దర్శన్ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం
పారడైస్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంపై హీరోయిన్ కామెంట్స్..
పారడైస్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంపై హీరోయిన్ కామెంట్స్..
-48 డిగ్రీల చలిలో స్వచ్ఛ భారత్‌.. అంటార్కిటికాలోనూ తగ్గని శుభ్రత!
-48 డిగ్రీల చలిలో స్వచ్ఛ భారత్‌.. అంటార్కిటికాలోనూ తగ్గని శుభ్రత!