Darshan: నీవల్లే ఇదంతా..! మర్డర్ తర్వాత పవిత్ర గౌడ పై నటుడు దర్శన్ దాడి.?

దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు రేణుకాస్వామి అనే వ్యక్తి అసభ్యకరమైన మెసేజులు పంపించాడు. ఆ విషయం ఆమె దర్శన్ కు చెప్పడంతో అతను కొంతమందితో రేణుకాస్వామి హత్య చేయించాడు. హత్య చేసిన నిందితులను పోలీసులు విచారించగా వారు దర్శన్ పేరు చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో పోలీసులు దర్శన్ ను అదుపులోకి తీసుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

Darshan: నీవల్లే ఇదంతా..! మర్డర్ తర్వాత పవిత్ర గౌడ పై నటుడు దర్శన్ దాడి.?
Darshan Thoogudeepa
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2024 | 1:44 PM

హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే న్యూస్ కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకేసులో దర్శన్ హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు రేణుకాస్వామి అనే వ్యక్తి అసభ్యకరమైన మెసేజులు పంపించాడు. ఆ విషయం ఆమె దర్శన్ కు చెప్పడంతో అతను కొంతమందితో రేణుకాస్వామి హత్య చేయించాడు. హత్య చేసిన నిందితులను పోలీసులు విచారించగా వారు దర్శన్ పేరు చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో పోలీసులు దర్శన్ ను అదుపులోకి తీసుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మర్డర్ తర్వాత పవిత్ర పై దర్శన్ దాడి చేసినట్లు తెలుస్తోంది.

దర్శన్, పవిత్ర కలిసి చాలా కాలంగా తిరుగుతున్నారు. ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత పదేళ్లుగా వీరు సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్దరూ కలిసున్న ఫోటోలను తమ సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తుంటారు. పవిత్రను వేధించినందుకే రేణుకాస్వామిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా దర్శన్ పవిత్ర పై కూడా దాడి చేశాడట. రేణుకాస్వామి హత్య తర్వాత పవిత్రపై దర్శన్ దాడి చేసినట్లు సమాచారం. నీ వల్లే ఇదంతా జరిగింది అని దర్శన్ ఆమె పై ఎటాక్ చేశాడట. దాడికి గురైన పవిత్ర బెంగళూరులోని ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందింది. సోమవారం(జూన్ 10) పవిత్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. హత్య కేసులో దర్శన్ పేరు ఉన్న మాట నిజమైతే.. అతడిని శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!