నా భార్యతో భరించలేకపోతున్నా.. విడాకులు ఇప్పించండి మహాప్రభో..! హీరో ఆవేదన

సమంత నాగ చైత్యన విడాకుల దగ్గర నుంచి చాలా మంది జంటలు విడిపోతున్నట్టు ప్రకటించారు. స్టార్ హీరో ధనుష్ కూడా తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడిపోయారు. అలాగే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా తన రెండో భార్య కిరణ్ తో విడిపోయారు. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కమ్ నటుడు జీవి ప్రకాష్ కూడా తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో నటుడు కూడా విడాకులకు అప్లై చేశారు.

నా భార్యతో భరించలేకపోతున్నా.. విడాకులు ఇప్పించండి మహాప్రభో..! హీరో ఆవేదన
Yuva Rajkumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2024 | 1:23 PM

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా విడాకుల న్యూస్ వినిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నారు. సమంత నాగ చైత్యన విడాకుల దగ్గర నుంచి చాలా మంది జంటలు విడిపోతున్నట్టు ప్రకటించారు. స్టార్ హీరో ధనుష్ కూడా తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడిపోయారు. అలాగే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా తన రెండో భార్య కిరణ్ తో విడిపోయారు. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కమ్ నటుడు జీవి ప్రకాష్ కూడా తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో నటుడు కూడా విడాకులకు అప్లై చేశారు. అయితే ఇప్పటివరకు విడిపోయిన జంటలు పరస్పర సమ్మతంతోనే విడిపోయారు. కానీ ఈ హీరో మాత్రం తన భార్య బాధ తట్టుకోలేకపోతున్నా అంటూ విడాకులకు అప్లై చేశాడు.

తన భార్య తనకు టార్చర్ చూపిస్తుందని .. తాను తట్టుకోలేకపోతున్నా అని ఓ నటుడు విడాకులకు అప్లై చేశాడు. ఆ హీరో ఎవరో కాదు కన్నడ నటుడు యువ రాజ్ కుమార్. ఈయన ఎవరో కాదు కన్నడ దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ మనవడు. ఇటీవలే కన్నడ ఇండస్ట్రీలో ఓ జంట విడిపోయింది. బిగ్ బాస్ ఫేమ్ చందన్ శెట్టి, నివేదిత గౌడ విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈ వార్త కన్నడ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వెంటనే ఇప్పుడు యువరాజ్ కుమార్ కూడా విడాకులకు అప్లై చేశాడు.

దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ ఇంటి నుంచి చాలా మంది స్టార్స్ ఉన్నారు. రాజ్ కుమారుల్లో శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్. వీరిలో రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడే ఈ యువరాజ్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన యువరాజ్ ఆతర్వాత హీరోగా సినిమాలు చేశాడు. కాగా శ్రీదేవి అనే మహిళను  ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇప్పుడు తనభార్య వేధిస్తోందని .. తనను కాపాడాలని కోర్టు మెట్లెక్కాడు. తనను హింసిస్తోందంటూ భార్యపై కేసు కూడా పెట్టాడు యువరాజ్. మానసికంగా వేధించిందని, తన నుండి కాపాడాలి వేడుకుంటున్నాడు యువరాజ్. దీని పై కోర్టు సమన్లు జారీ చేసిందని తెలుస్తోంది. కాగా శివరాజ్ కుమార్ ఫ్యామిలిలో ఇదే మొదటి విడాకుల కేసు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి