AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: ట్రావెలింగ్ చేస్తే అలాంటి బెనిఫిట్స్.. అభిమానులకు హీరో అజిత్ వీడియో సందేశం..

తాజాగా తన అభిమానులకు అజిత్ షేర్ చేసిన ఓ వీడియో సందేశం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందులో ట్రావెలింగ్ గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చారు అజిత్. ట్రావెలింగ్ చేయడం వల్ల అనేక విషయాలు నేర్చుకోవచ్చని.. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయని..

Ajith Kumar: ట్రావెలింగ్ చేస్తే అలాంటి బెనిఫిట్స్.. అభిమానులకు హీరో అజిత్ వీడియో సందేశం..
Ajith
Rajitha Chanti
|

Updated on: Oct 05, 2024 | 5:51 PM

Share

కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సినీరంగంలో ఉన్న హీరోలకు అజిత్ పూర్తిగా విభిన్నం. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన బైక్ రైడింగ్‏తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. అజిత్.. సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండరు. ఇప్పటికీ సొంతంగా మొబైల్ కూడా ఉపయోగించని ఏకైక హీరో. కానీ అజిత్ సినిమాలు, పర్సనల్ విషయాల గురించి అతడి మేనేజర్ నెట్టింట పోస్టులు చేస్తుంటారు. తాజాగా తన అభిమానులకు అజిత్ షేర్ చేసిన ఓ వీడియో సందేశం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందులో ట్రావెలింగ్ గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చారు అజిత్. ట్రావెలింగ్ చేయడం వల్ల అనేక విషయాలు నేర్చుకోవచ్చని.. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయని.. ప్రయాణం ఉత్తమ విద్యను అందిస్తుందని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నానని అన్నారు.

“ప్రయాణం.. ఉత్తమ విద్యను అందిస్తుందని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ట్రావెలింగ్ మిమ్మల్ని మరింత ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. మతం, వర్గం ఇలా వివిధ కారణాల వల్ల మనతో పరిచయం లేని వారిని కూడా మనం ద్వేషిస్తుంటాం అని ఒక సూక్తి ఉంది. అది నిజం. పరిచయం లేనప్పటికీ ఎదుటివారిని జడ్జ్ చేస్తుంటాం. కానీ, మీరు ప్రయాణించినప్పుడు.. వివిధ ప్రాంతాలు, మతాలకు చెందిన వారిని కలుస్తుంటారు. వారి సంస్కృతి, సంప్రదాయాల గురించి మీరూ తెలుసుకుంటారు. దీంతో ఇతరులపై మనకు సానుభూతి ఏర్పడుతుంది. ప్రయాణం వల్ల మీరు ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతారు ” అంటూ అజిత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అజిత్ వీడియోకు అభిమానులు, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం అజిత్ విదాముయార్చి చిత్రంలో నటిస్తున్నారు. అజిత్ 62వ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు. మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే