Actor Ajith: స్టార్ హీరో ఇంటికి బాంబ్ బెదిరింపు కాల్.. తనిఖీ చేసిన బాంబ్ స్వాడ్ చివరకు ..
సెలబ్రిటీల ఇళ్లకు బెదిరింపు కాల్స్ రావడం సహజమే. ఎవరో ఆకతాయిలు పోలీసులకు ఫోన్ చేసి పలానా హీరో ఇంట్లో బాంబ్ ఉంది అని చెప్పి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంటారు.
సెలబ్రిటీల ఇళ్లకు బెదిరింపు కాల్స్ రావడం సహజమే. ఎవరో ఆకతాయిలు పోలీసులకు ఫోన్ చేసి పలానా హీరో ఇంట్లో బాంబ్ ఉంది అని చెప్పి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంటారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నైలోని ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. దీంతో, ఈ కాల్ కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. జాగిలాలతో పాటు అజిత్ ఇంటికి వెళ్లిన బాంబ్ స్వాడ్ ఇంటి మొత్తాన్ని తనిఖీ చేశారు. బాంబ్ కనిపించకపోవడంతో… అది ఫేక్ కాల్ అని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఆ కాల్ నంబర్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. గతంలో ఇలా చాలామంది సినిమాతారల కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి కూడా ఇలానే కాల్స్ వెళ్లాయి. ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వినోద్ తో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తూ ఉండగా, కార్తికేయ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదల కోసం అజిత్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో నీర్కెండ పార్త్వే అనే మూవీ వచ్చింది. ఇది హిందీ పింక్ మూవీకి రీమేక్.
మరిన్ని ఇక్కడ చదవండి :