AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adil Hussain: సందీప్ అతడి కంటే ఫేమస్ అనుకుంటున్నాడా..? బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్..

ఇందులో బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ కీలకపాత్ర పోషించాడు. అయితే కబీర్ సింగ్ చిత్రంలో నటించినందుకు చాలా గిల్టీగా ఫీలవుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆదిల్ హుస్సేన్. తన పాత్ర బానే ఉందని.. కానీ సినిమా విడుదలయ్యాక చూసి సిగ్గుతో తలదించుకున్నానని అన్నారు. ఆదిల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కాగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి తన స్టైల్లో కౌంటరిచ్చారు.

Adil Hussain: సందీప్ అతడి కంటే ఫేమస్ అనుకుంటున్నాడా..? బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్..
Adil Hussain, Sandeep Reddy
Rajitha Chanti
|

Updated on: Jun 13, 2024 | 12:15 PM

Share

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. తెలుగులో హీరోగా విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు సందీప్ రెడ్డి. ఇందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రం దాదాపు రూ.379 కోట్లు రాబట్టింది. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ కీలకపాత్ర పోషించాడు. అయితే కబీర్ సింగ్ చిత్రంలో నటించినందుకు చాలా గిల్టీగా ఫీలవుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆదిల్ హుస్సేన్. తన పాత్ర బానే ఉందని.. కానీ సినిమా విడుదలయ్యాక చూసి సిగ్గుతో తలదించుకున్నానని అన్నారు. ఆదిల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కాగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి తన స్టైల్లో కౌంటరిచ్చారు.

ఇక తాజాగా సందీప్ మాటలపై రియాక్ట్ అయ్యాడు ఆదిల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిల్ మాట్లాడుతూ.. ” సందీప్ ఏమైనా డైరెక్టర్ ఆంగ్ లీ కంటే ఎక్కువ ఫేమస్ అనుకుంటున్నాడా..? అతడు అలా ఆలోచిస్తే నేను ఏమి చెప్పాలో నాకు తెలియడం లేదు. అతను అలా ఆలోచించడం చాలా దురదృష్టకరం. అతడు తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా కలెక్షన్స్ రాబట్టాయి కదా.. బహుశా అందుకే అలా అనుకుంటున్నాడేమో. కబీర్ సింగ్ కలెక్షన్స్ కచ్చితంగా ఎంత అనేది నాకు తెలియదు. కానీ ఆంగ్ లీ తెరకెక్కించిన లైఫ్ ఆఫ్ పై సినిమా దాదాపు రూ.5 వేల కోట్లకు పైన రాబట్టింది. ఈ లెక్కలను అతడి సాధిస్తాడని నేను అనుకోవడం లేదు. అతను మాట్లాడే ముందు కాస్త ఆలోచించి ఉండాల్సింది” అని అన్నారు.

అలాగే సందీప్ రూపొందించిన యానిమల్ సినిమాను తాను చూడలేదని అన్నారు. ఒకవేళ ఆ సినిమాలో ఛాన్స్ వస్తే నటిస్తారా ? అని అడగ్గా.. లేదన్నారు ఆదిల్. “యానిమల్ సినిమాలో నటించేందుకు నాకు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఇచ్చినా నటించేవాడిని కాదు. ఎప్పటికీ అలాంటి చిత్రాల్లో నటించను. అలాగే నా గురించి సందీప్ చేసిన కామెంట్స్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఎలాంటి అర్థం లేదు ” అని అన్నారు. 2012లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై చిత్రంలో ఆదిల్ ముఖ్య పాత్ర పోషించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే