‘ఆవిరి’ ట్రైలర్ టాక్: థ్రిల్లింగ్, హర్రర్‌లో రవిబాబు తోపు అబ్బా!
‘అల్లరి`, `నచ్చావులే`, `అనసూయ`, `అవును`, `అవును 2` ..వంటి పలు చిత్రాల ద్వారా తనదైన మార్కుతో దర్శకుడిగా రవిబాబు తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు . ఆయన మూవీ వస్తుందంటేనే అందులో ఏదో స్పెషల్ ఉంటుందని ఆడియెన్స్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తుంటారు. ఆయన ఇటీవలే పందిపిల్ల ప్రధాన పాత్రలో ‘అదుగో’ అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా అనుకున్నంత ఆదరణ పొందలేదు. తాజాగా ‘ఆవిరి’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ . ఇందులో […]

‘అల్లరి`, `నచ్చావులే`, `అనసూయ`, `అవును`, `అవును 2` ..వంటి పలు చిత్రాల ద్వారా తనదైన మార్కుతో దర్శకుడిగా రవిబాబు తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు . ఆయన మూవీ వస్తుందంటేనే అందులో ఏదో స్పెషల్ ఉంటుందని ఆడియెన్స్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తుంటారు. ఆయన ఇటీవలే పందిపిల్ల ప్రధాన పాత్రలో ‘అదుగో’ అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా అనుకున్నంత ఆదరణ పొందలేదు. తాజాగా ‘ఆవిరి’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ . ఇందులో రవిబాబు, నేహా చౌహన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫ్లైయింగ్ ప్రాగ్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు తన సొంత బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ మీదుగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
రీసెంట్‌గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీం. చిన్న పాప మిస్ అవడం, ఆమెని ఆత్మ తీసుకెళ్లిపోయిందనుకుని ఫిక్స్ అవడం.. పాప మళ్లీ మళ్లీ ఎస్కేప్ అవడం.. ఆమెని కనిపెట్టడానికి వచ్చిన వాళ్లు ప్రమాదాలకు గురి కావడం.. ఇలా ఉత్కంఠతగా ఉంది ట్రైలర్.. ఫస్ట్‌లుక్‌తోనే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసిన రవిబాబు టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచాడు. ఈ సినిమాలో ఆవిరికి, ఇంట్లో ఉన్న ఆత్మకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే రిలీజ్ డేట్ అయిన నవంబర్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే!