Aarthi Agarwal: వైరల్‌గా మారిన ఆర్తీ అగర్వాల్ ఓల్డ్ వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఆర్తీఅగర్వాల్. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ల సరసన సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. అలాగే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, రవితేజ,ఉదయ్ కిరణ్, తరుణ్ సరసన సినిమాలు చేసి రాణించింది.

Aarthi Agarwal: వైరల్‌గా మారిన ఆర్తీ అగర్వాల్ ఓల్డ్ వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు
Aarthi Agarwal
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 12, 2024 | 5:41 PM

స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది.. ఇండస్ట్రీలో రాణిస్తుంది అనుకున్న ఆర్తీఅగర్వాల్ అనూహ్యంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈ గుజరాతీ భామ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వునాకు నచ్చావ్ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఆర్తీఅగర్వాల్. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ల సరసన సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. అలాగే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, రవితేజ,ఉదయ్ కిరణ్, తరుణ్ సరసన సినిమాలు చేసి రాణించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది ఆర్తీఅగర్వాల్. వెంకటేష్ సరసన నటించిన మూడు చిత్రాలు నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి సూపర్ హిట్ గా నిలిచాయి.

2001వ సంవత్సరంలో బాలీవుడ్‌లో పాగల్‌పాన్‌ సినిమాలో ఛాన్స్ అందుకుంది. తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. నటించింది. 2005, మార్చి 23న క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అలాగే 2006 ఫిబ్రవరి 15లో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది. ఆతర్వాత 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్ షిప్ లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ 6, 2015 న కన్నుమూసింది.

ఇదిలా ఉంటే ఆర్తీఅగర్వాల్ కు సంబందించిన ఓ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇంతమంచి హీరోయిన్ అనాసరంగా కన్నుమూసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వైరల్ వీడియోలో ఆర్తీఅగర్వాల్ తన స్టాఫ్ తో సరదాగా గడుపుతూ కనిపించింది. కేక్ కట్ చేసి అందరికి తినిపిస్తూ సందడి చేసింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం శ్రీలీలలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్తి అగర్వాల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.