Aadikeshava: ఏం వాడకం బాసూ.. మహేష్ బాబు సినిమా సీన్ మక్కికి మక్కి దింపేశారుగా..

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 24న థియేటర్స్ లోకి వచ్చింది. కానీ బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఆదికేశవ సినిమా. ఓటీటీలో ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ సినిమాలో సన్నివేశాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

Aadikeshava: ఏం వాడకం బాసూ.. మహేష్ బాబు సినిమా సీన్ మక్కికి మక్కి దింపేశారుగా..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 25, 2023 | 11:45 AM

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన నయా మూవీ ఆదికేశవ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఈసినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 24న థియేటర్స్ లోకి వచ్చింది. కానీ బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఆదికేశవ సినిమా. ఓటీటీలో ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ సినిమాలో సన్నివేశాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకు అసలు మ్యాటర్ ఏంటంటే..

డిసెంబర్ 22న ఆదికేశవ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ  నెట్ ఫ్లిక్స్ ఆదికేశవ సినిమాను స్ట్రీమింగ్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక సన్నివేశం ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమాలో ఓ కారు యాక్సిడెంట్ సన్నివేశం మరో సినిమాలో నుంచి మక్కికి మక్కి కాపీ కొట్టారు. ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది.

ఆదికేశవ సినిమాలో ఓ కారును లారీ ఢీ కొట్టే సన్నివేశం చూపించారు. ఈ సీన్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా నుంచి దింపేశారు. దాంతో ఆ రెండు సీన్స్ ను పక్క పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆదికేశవ సినిమాతో పంజా వైష్ణవ్ తేజ్‌కి ఒక మంచి కమర్షియల్ హిట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది బెడిసికొట్టింది. చివరకు శ్రీలీల గ్లామర్ ఎనర్జీ కూడా ఈ సినిమాను అందుకోలేకపోయింది.

వైష్ణవ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి