Hi Nanna OTT: ఓటీటీలోకి నాని నయా మూవీ.. హాయ్ నాన్న సినిమా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడు.. ఎక్కడంటే..
హాయ్ నాన్న సినిమాకు శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కూతురు మధ్య సాగె ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఎప్పటిలానే నాని తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.
ఈ ఏడాది హీరో నానికి బాగానే కలిసొచ్చింది.. రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు నాని. ముందుగా వచ్చిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇన్ని రోజులు లవర్ బాయ్ గా కనిపించిన నాని ఈ సినిమాలో ఊర మాస్ అవతార్ లో కనిపించి మెప్పించాడు. ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటించింది. ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా హయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ ఏడాది రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ నేచురల్ స్టార్.
హాయ్ నాన్న సినిమాకు శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కూతురు మధ్య సాగె ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఎప్పటిలానే నాని తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ దక్కాయి.
ఇదిలా ఉంటే హాయ్ నాన్న సినిమా థియేట్సర్ లో సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు అంతా ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కాగా హాయ్ నాన్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది. హాయ్ నాన్న ఓటీటీ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ హాయ్ నాన్న సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుందట. జనవరి 12 అంటే సంక్రాంతికి ఈ సినిమాను ఓటీటీలోకి వదిలే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేయనున్నాయి. అలాగే నాని హాయ్ నాన్న సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ అయ్యి సందడి చేసే ఛాన్స్ ఉందని టాక్. చూడాలి మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది.
నాని ట్విట్టర్ పోస్ట్..
— Hi Nani (@NameisNani) December 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి