Sankarabharanam: దశాబ్దాలు పూర్తైనా ఎప్పటికీ ప్రత్యేకమే.. శంకరాభరణం సినిమాకు మరో అరుదైన గౌరవం..

శంకరాభరణం. 1980లో డైరెక్టర్ కె. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగీత ప్రాధాన్యత గల సినిమా ఇది. ఈ మూవీని పూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.

Sankarabharanam: దశాబ్దాలు పూర్తైనా ఎప్పటికీ ప్రత్యేకమే.. శంకరాభరణం సినిమాకు మరో అరుదైన గౌరవం..
Sankarabharanam
Follow us

|

Updated on: Nov 21, 2022 | 4:52 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో రికార్డ్స్ క్రియేట్స్ చేస్తోంది. ముఖ్యంగా దక్షిణాది డైరెక్టర్స్ స్క్రీన్ ప్లేకు విదేశీయులు సైతం ఫిదా అవుతున్నారు. కానీ నలభై సంవత్సరాల క్రితమే తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్యకావ్యం మరొకటి ఉంది. అదే శంకరాభరణం. 1980లో డైరెక్టర్ కె. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగీత ప్రాధాన్యత గల సినిమా ఇది. ఈ మూవీని పూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. జె.వి సోమయాజులు.. మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ కీలకపాత్రలలో నటించగా.. కె.వి మహదేవన్ సంగీతం అందించారు. 70వ దశకంలో ఘన విజయం సాధించిన ఈ మూవీ కి ఇప్పుడు మరో అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక్లలో రీస్టో్ర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది.

నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మన దేశంలోని ఇలాంటి గొప్ప సినిమాలను డిజిటలైజ్ చేసి ప్రదర్శించనున్నారు. ఈ కేటగిరిలో శంకరాభరణం సినిమాకు చోటు దక్కింది. ఈ సినిమాను పనాజీలో ఇఫి-2022 వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ప్రదర్శనకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఉత్సవాల్లో 79 దేశాలకు చెందిన 280 చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఈసారి ప్రదర్శనకు ఎంపికైన సినిమాల్లో నలభై శాతం మహిళా దర్శకులు రూపొందించినవే కావడం విశేషం. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్.. ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా వేడుకల్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.