AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతకు హైదరాబాద్‌లో కళ్లు చెదిరే ఆస్తులు.. కాస్ట్లీ కార్లు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

కేవలం సినిమాలు మాత్రమే కాదు. పలు యాడ్స్ ద్వారా కూడా భారీగా అర్జిస్తుంది సమంత. సౌత్‌లో నయనతార తర్వాత అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటి సమంత. ఇక పుష్పలో ఐటమ్ సాంగ్‌ కోసం ఆమె రికార్డు రేంజ్ పారితోషకం తీసుకుంది.

Samantha: సమంతకు హైదరాబాద్‌లో కళ్లు చెదిరే ఆస్తులు.. కాస్ట్లీ కార్లు ఎన్ని ఉన్నాయో తెలుసా..?
Samantha Ruth Prabhu
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2023 | 3:27 PM

Share

సమంత శుక్రవారం 36వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో నెట్టింట బాగా ట్రెండ్ అయ్యారు. ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు. అంతేనా ఏపీలో సమంత కోవెల కూడా ప్రారంభమైంది. సామ్‌కు స్టార్ హీరోల రేంజ్ ఫ్యాన్ బేస్ సమంతకు ఉందన్న విషయం తెలిసిందే. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం  తీసుకునే నటీమణుల్లో ఆమె ముందు వరసలో ఉంటారు. ఇంత కెరీర్ స్పాన్‌లో సమంత ఎంత సంపాదించారు..? ఆమె ఆస్తుల విలువ  ఎంత..? వంటి అంశాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

సమంతా నికర ఆస్తుల విలువ 2023

అందుతోన్న సమాచారం ప్రకారం , సమంత రూత్ ప్రభు నికర ఆస్తుల విలువ 101 కోట్లు. ఆమె ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకుంటుంది. సినిమాలు మాత్రమే కాకుండా పలు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీ సంపదను వెనుకేసుకుంటుంది. దక్షిణాదిలో నయనతార తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి  సమంత. పుష్ప: ది రైజ్ ఫిల్మ్‌లోని ఊ అంటావా పాట కోసం ఆమె రూ.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

జూబ్లీ హిల్స్ హోమ్

సమంత హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని కళ్లు చెదిరే లగ్జరీ హౌస్‌లో నివసిస్తోంది.  ఆ ఇంటిని తనకు నచ్చినట్లుగా డిజైన్  చేయించుకుంది. లోపల ఉండే సోఫాల దగ్గర్నుంచి, ఇంటిరీయర్ డిజైన్ వరకు అన్నీ తనకు కావాల్సిన విధంగా ఆమె వర్క్ చేయించుకున్నారు.

కార్ కలెక్షన్

2.26 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ నుండి పోర్షే కేమాన్ జిటిఎస్ వరకు.. బోలెడన్ని కార్లు సమంత గ్యారేజ్‌లో ఉన్నాయి. ఆ లిస్ట్ చూసేద్దాం పదండి

  • ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ – రూ 2.26 కోట్లు
  • పోర్షే కేమాన్ GTS – రూ 1.46 కోట్లు
  • జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ – రూ. 72 లక్షలు
  • Mercedes Benz G63 AMG – రూ. 3.30 కోట్లు
  • ఆడి క్యూ7 — రూ. 87 లక్షలు
  • BMW 7 సిరీస్- రూ. 1.70 కోట్లు

హైదరాబాద్‌లో పెట్టుబడులు

మిస్ ఇండియా 2016 ఫస్ట్ రన్నరప్ అయిన సుశ్రుతి కృష్ణతో కలిసి సమంత 2020లో సాకి అనే ఫ్యాషన్ లేబుల్‌ని ప్రారంభించింది సామ్. అంతేకాదు సస్టైన్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టింది.  శిల్పా రెడ్డి,  కాంతి దత్ ఇందులో భాగస్వాములుగా ఉన్నారు.

ముంబై హోమ్

ప్రజంట్ సౌత్‌లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది సామ్.  రెగ్యులర్‌గా ముంబైలో కనిపిస్తుంది. ఆమె ముంబైలో రూ. 15 కోట్ల విలువైన కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. సమంతకు మున్ముందు మరింత రాక్ చేయాలని ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.