Vijay Devarakonda: యాదాద్రిలో విజయ్ దేవరకొండను హత్తుకునేందుకు ప్రయత్నించిన అమ్మాయి.. హీరో ఏం చేశాడో తెలుసా?
ఖుషి విజయోత్సాహంలో ఉన్న విజయ్ దేవరకొండ ఆదివారం (సెప్టెంబర్ 3)న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి, తమ్ముడు ఆనంద్ దేవరకొండ యాదాద్రీశుడి ఆశీస్సులు అందుకున్నారు. వీరి వెంట ఖుషి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు వై. రవిశంకర్, నవీన్ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ తదితరులు కూడా ఉన్నారు.
లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ఎదుర్కొన్న హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఖుషి ఖుషీగా ఉన్నాడు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజైన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అందుకే విడుదలైన రెండు రోజుల్లోపే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఖుషి విజయోత్సాహంలో ఉన్న విజయ్ దేవరకొండ ఆదివారం (సెప్టెంబర్ 3)న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి, తమ్ముడు ఆనంద్ దేవరకొండ యాదాద్రీశుడి ఆశీస్సులు అందుకున్నారు. వీరి వెంట ఖుషి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు వై. రవిశంకర్, నవీన్ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ తదితరులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆధికారులు ఖుషి టీమ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ దర్శనానంతరం విజయ్ దేవరకొండతో పాటు ఆయన కుటుంబసభ్యులను బయటకు వస్తున్నప్పుడు అనుకోని సంఘటన జరిగింది. ఒక అమ్మాయి విజయ్ దేవరకొండ దగ్గరకు పరుగెత్తుకు వచ్చి అతనిని హత్తుకునేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే ఆ అమ్మాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే విజయ్ దేవరకొండ ఆ అమ్మాయిని ఏమి అనవద్దని పోలీసులకు సర్ది చెప్పారు. ఆ లేడీ ఫ్యాన్‌తో మాట్లాడి ఫొటోలు కూడా దిగారు. తమ అభిమాన హీరోతో కలిసి ఫొటో దిగిన ఆ అమ్మాయి ఆనందానికి అవధుల్లేవు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దర్శనానంతరం ఆలయ పరిసరాల్లో మీడియాతో మాట్లాడారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాది తమ ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందన్నారు రౌడీ బాయ్. ‘ మా బ్రదర్ ‘(ఆనంద్ దేవరకొండ) బేబీ సినిమా, నేను నటించిన ఖుషి రెండూ విజయవంతమయ్యాయి. అందుకే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చాను. మా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రీశుడిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉంది. పునర్మిర్మాణంలో యాదాద్రి టెంపుల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతులు. మాలాగే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని విజయ్ దేవరకొండ తెలిపారు.
యాదాద్రి గుడిలో విజయ్ దేవరకొండ .. వైరల్ వీడియో
అమ్మాయిలు మీరు కూడ ఇలా వచ్చేస్తే ఎలా 🤦♂️#BlockbusterKushi 🩷 pic.twitter.com/oHPb9uhQLf
— Sreenivas Gandla (@SreenivasPRO) September 3, 2023
కుటుంబ సభ్యులతో ఖుషి హీరో విజయ్ దేవరకొండ
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఖుషి సినిమా టీమ్ 🙏😍#KushiforFamilies pic.twitter.com/xUU1Bj1VWc
— Sreenivas Gandla (@SreenivasPRO) September 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.