AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7/G Brundavan Colony :‏ రీరిలీజ్‏కు రెడీ అవుతోన్న సూపర్ హిట్ మూవీ.. 7/G బృందావన్ కాలనీ విడుదల డేట్ ఫిక్స్..

తమిళంలో డైరెక్టర్ సెల్వరాఘవన్ తెరకెక్కించిన 7/G రెయిన్ బో కాలనీ సినిమాను తెలుగులో 7/G బృందావన్ కాలనీ పేరుతో విడుదల చేశారు. ఈ సూపర్ హిట్ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మరో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది.

7/G Brundavan Colony :‏ రీరిలీజ్‏కు రెడీ అవుతోన్న సూపర్ హిట్ మూవీ.. 7/G బృందావన్ కాలనీ విడుదల డేట్ ఫిక్స్..
Brundavan Colony
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2023 | 6:16 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిత్రాల్లో 7/G బృందావన్ కాలనీ ఒకటి. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళంలో డైరెక్టర్ సెల్వరాఘవన్ తెరకెక్కించిన 7/G రెయిన్ బో కాలనీ సినిమాను తెలుగులో 7/G బృందావన్ కాలనీ పేరుతో విడుదల చేశారు. ఈ సూపర్ హిట్ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మరో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ ప్లాన్స్ జరుగుతున్నాయి. సెకండ్ పార్ట్ లో రవికృష్ణ కథానాయకుడిగా నటించనుండగా.. హీరోయిన్స్ ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లుగా టాక్ నడిచింది. తాజాగా ఈ మూవీ రీరిలీజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాను రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రీరిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు కూడా సూపర్ హిట్ కావడం ఖాయం. ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా.. శ్రీసూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు.

ఇదిలా ఉంటే 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ షూటింగ్ ఆగస్ట్ 2023 చివరి వారంలో స్టార్ట్ కానుందట. ఇందులో లవ్ టూడే ఫేమ్ ఇవానా, అదితి శంకర్ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సీక్వెల్ పై మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.