Mahesh Babu: తమకోసం వచ్చిన అభిమానుల కడుపునింపిన మహేష్.. 32 రకాల వంటకాలతో భోజనం

దాదాపు 350 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకున్నారు సూపర్ స్టార్. ఇక కృష్ణ మరణం తో ఆయన కుటుంబసభ్యులు శోకంలో మునిగిపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు.

Mahesh Babu: తమకోసం వచ్చిన అభిమానుల కడుపునింపిన మహేష్.. 32 రకాల వంటకాలతో భోజనం
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2022 | 1:25 PM

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణ మరణంతో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ ఒక చెరిగిపోని ముద్ర వేశారు. దాదాపు 350 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకున్నారు సూపర్ స్టార్. ఇక కృష్ణ మరణం తో ఆయన కుటుంబసభ్యులు శోకంలో మునిగిపోయారు. ముఖ్యంగా మహేష్ బాబు. ఈ ఏడాది మహేష్ బాబు అన్న, అమ్మ, నాన్న ఇలా ఒకరితర్వాత ఒకరిని కోల్పోయారు. దాంతో మహేష్ ఎంతో మనోవేదనకు గురవుతున్నారని తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మను నిర్వహించారు  కుటుంబసభ్యులు. ఈ నెల 27న  హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ  భావోద్వేగానికి గురయ్యారు.

“నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం.. అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లోనూ ఉంటారు. ఆయన ఎప్పుడూ మనమధ్యే ఉంటారు. మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్. ఇక కృష్ణ దశ దిన కర్మకు వచ్చిన అభిమానులకు కడుపునిండా భోజనం పెట్టారు మహేష్ బాబు.

ఇవి కూడా చదవండి

సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెషన్‌లో విందు ఏర్పాటుచేసిన మహేష్.. అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్‌లో విందు ఇచ్చారు. అభిమానుల కోసం 32 రకాల వంటకాలను మహేష్ బాబు సిద్ధం చేయించారు. భోజనం చేసిన కొందరు అభిమానులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మహేష్ అన్న మా కోసం 32 ఐటెమ్స్ పెట్టించారు అంటూ కొనియాడారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..