AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: ఫైమాను కాపాడిన ఎవిక్షన్ ఫ్రీ పాస్.. బలైంది మాత్రం అతనే

ఇప్పటికే టాప్ లో ఉంటారన్న వాళ్లంతా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన ఎలిమినేషన్  కూడా ఊహించని ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Bigg Boss 6 Telugu: ఫైమాను కాపాడిన ఎవిక్షన్ ఫ్రీ పాస్.. బలైంది మాత్రం అతనే
Bigg Boss 6
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2022 | 7:31 AM

Share

బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ఎలిమినేషన్స్ ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఎవరు హౌస్ లో ఉంటారో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారో ఊహించడం కష్టంగానే ఉంది. ఇప్పటికే టాప్ లో ఉంటారన్న వాళ్లంతా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన ఎలిమినేషన్  కూడా ఊహించని ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఫైమాను ఎలిమినేట్ చేసినా తన దగ్గర ఉన్న ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’తో ఆమె సేవ్ అయిపోయింది. కానీ ఇంకో కంటెస్టెంట్ బలి అయ్యాడు. నిన్న జరిగిన ఎలిమినేషన్ నామినేషన్స్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ నిలిచారు. వీరిలో ఆది రెడ్డి, ఫైమా,  రాజ్ నామినేషన్ లో ఉన్నారు. అయితే ఫైమాను ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో నాగ్ దాన్ని నువ్వే వాడుకుంటావా లేక వేరే  వాళ్ళను సేవ్ చేస్తావా అని ప్రశ్నించగా తర్వాత చెప్తా అని బదులిచ్చింది. ఆ తర్వాత జరిగిన లెవల్ లో ఆది రెడ్డి సేవ్ అయ్యాడు.

ఇక చివరకు ఫైమా.. రాజ్ లు మిగిలారు. ఇక ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకుంటావా అని ఫైమా ను నాగ్ అడిగారు. ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’‌ను నీకే ఇచ్చేస్తానని ఫైమా రాజ్‌తో వ్యక్తిగతంగా చెప్పింది. కానీ, రాజ్ దానికి ఒప్పుకోలేదు. ఈ పాస్ నువ్వే గెలుచుకున్నావు కాబట్టి దాన్ని నీ దగ్గరే పెట్టుకోవాలి అని అన్నాడు. హౌస్ మేట్స్ కూడా రాజ్ చెప్పిందే కరెక్ట్ అనడంతో ప్రేక్షకుల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. ఫైమా దగ్గర పాస్ తాను వాడుకొని సేవ్ అయ్యే ఉద్దేశం లేదని రాజ్ చెప్పాడు. నాగ్  కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటే బిగ్ బాస్ ఇచ్చిన ఒక కొత్త శక్తి అని.. దాన్ని వాడుకోవాలని అన్నారు

దాంతో ఆమె ఆ పాస్ ను వాడుకుంది. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో ఆమె సేవ్ అయ్యింది. మొత్తానికి రాజ్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే హౌస్‌లో చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఇక ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన రాజ్ తన జర్నీని ఒకసారి చూసుకున్నాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు.

ఇవి కూడా చదవండి
Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..