2018: కలెక్షన్స్ కుమ్మేస్తున్న 2018.. మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూల్ చేసిందంటే

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి అనూహ్య విజయాన్ని అందుకుంది. మలయాళంలో భారీ విజయం అందుకోవడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోందీ సినిమాకు.

2018: కలెక్షన్స్ కుమ్మేస్తున్న 2018.. మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూల్ చేసిందంటే
2018 Movie
Follow us

|

Updated on: May 30, 2023 | 9:14 AM

జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 2018 చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిందీ మలయాళి చిత్రం. మలయాళి ఇండస్ట్రీలో రూ. 150 కోట్లు కలెక్ట్‌ చేసిన ఏకైక చిత్రంగా నిలిచిందీ మూవీ. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి అనూహ్య విజయాన్ని అందుకుంది. మలయాళంలో భారీ విజయం అందుకోవడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోందీ సినిమాకు. మలయాళంలో ఈ సినిమా మే5వ తేదీన విడుదలకాగా, తెలుగులో మాత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా వీకెండ్లో ఎంత వసూల్ చేసిందో తెలుసా.. నైజాం 0.88 కోట్లు, సీడెడ్ 0.36 కోట్లు, ఆంధ్ర 0.79 కోట్లు, ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి  2.03 కోట్లు వసూల్ చేసింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.

మొదటి వీకెండ్ లో ఈ చిత్రం రూ.2.03 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆల్రెడీ రూ.0.33 కోట్లు ప్రాఫిట్ అందించిన ఈ మూవీ రానున్న రోజుల్లో మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 2018 సినిమా ఓటీటీ హక్కులను సోనీలివ్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను జూన్‌ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని సోనీలివ్‌ అధికారికంగా వెల్లడించింది.

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్