5

Mahesh Babu: “దైవం మనుష్య రూపేనా”.. ఇది మీకు బాగా సూట్ అవుతుంది అంటున్న మహేష్ ఫ్యాన్స్..!

దేవుడు అక్కడెక్కడో.. ఎక్కడెక్కడో ఉండడు. మనుషుల్లోనే ఉంటాడు. మన మధ్యే తిరుగుతుంటాడు. మనకు అవసరమైనప్పుడు మరో మనిషి రూపంలోనే తారసపడుతుంటాడు. సాయపడుతుంటాడు. అందుకే దైవం మనుష్య రూపేనా అనే...! ఎప్పటి నుంచో...అంటున్నారు మన పెద్దోళ్లు. అయితే వాళ్లు చెప్పిన ఈ లైన్‌కు ఎగ్జాక్ట్ విజువల్‌గా మారిపోయారు మన మహేషుడు.

|

Updated on: May 30, 2023 | 9:44 AM

దేవుడు అక్కడెక్కడో.. ఎక్కడెక్కడో ఉండడు. మనుషుల్లోనే ఉంటాడు. మన మధ్యే తిరుగుతుంటాడు. మనకు అవసరమైనప్పుడు మరో మనిషి రూపంలోనే తారసపడుతుంటాడు. సాయపడుతుంటాడు. అందుకే దైవం మనుష్య రూపేనా అనే…! ఎప్పటి నుంచో…అంటున్నారు మన పెద్దోళ్లు. అయితే వాళ్లు చెప్పిన ఈ లైన్‌కు ఎగ్జాక్ట్ విజువల్‌గా మారిపోయారు మన మహేషుడు. మనిషి రూపంలో ఉన్న దేవుడనే ట్యాగ్‌ను తన చేతలతో వచ్చేలా చేసుకుంటున్నాడు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రిన్స్‌ గా.. సూపర్ స్టార్‌గా నామ్ కమాయించిన మహేష్ బాబు.. ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉంటారు. సూపర్ డూపర్ హిట్లు కొడతుంటారు. దాంతో పాటే.. నిరుపేదలకు సాయం చేయడాన్ని ఓ ప్రవృత్తిగా పెట్టుకున్నారు. హృదయ సంబంధ వ్యాధితో బాధపుడుతున్న నిరుపేదల పిల్లలకు త్రూ తన MB ఫౌండేషన్‌! ఆపరేషన్స్‌ చేపిస్తుంటారు. ఆ పిల్లల తల్లిదండ్రుల చేత దేవుడిగా కొలవబడుతుంటారు. ఇక ఈ క్రమంలోనే మరో చిన్నారికి ఆయువు పోశారు.. మహేష్. తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలుడికి ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేయించారు. ఎస్ ! కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన రెండేళ్ల కార్తికేయ అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం హాస్పటల్‌కు వెళ్లగా గుండెలో హోల్‌ ఉందని వైద్యులు నిర్ధారించారు. పేదరికంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీకి గుండె ఆపరేషన్‌ చేయించడం భారంగా మారింది. అప్పుడే కొందరి ద్వారా మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ గురించి తెలుసుకున్నారు. తాజాగా బాలుడికి ఉచితంగా హార్ట్‌ సర్జరీ చేసి డిశ్చార్జ్‌ చేసినట్లు పిల్లాడి తల్లిదండ్రులు చెప్పారు. మహేష్ కు రుణం తీర్చుకోలేని దంటూ ఎమోషనల్ కూడా అయ్యారు. ఇక మహేష్‌ చేసిన ఈ సాయం గురించి బయటికి తెలియడంతో.. దటీజ్ మహేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మహేష్కున్న గుణం మరెవరికీ ఉండదంటూ.. తమ కామెంట్స్లో కోట్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us