ఆ హీరోతో చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. వచ్చిన డబ్బంతా ఒక్కదెబ్బతో పోయాయి
తెలుగు సినీ ప్రపంచంలో విజయవంతమైన నిర్మాతలలో నిర్మాత దిల్ రాజు ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే తన జీవితంలో ఒక సినిమా ఎంతటి మలుపు తిప్పిందో పంచుకున్నారు. నిబద్ధత, నిజాయితీ వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు,. బడా హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నారు దిల్ రాజు. త్వరలోనే ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు దిల్ రాజు. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా తెలంగాణ ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, గుణపాఠాలనుపంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. తొలినాళ్లలో డిస్ట్రిబ్యూటర్‌గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, వరుసగా మూడు ఫ్లాప్‌ల తర్వాత “ఐరన్ లెగ్” అనే ముద్ర తనపై పడిందని ఆయన గుర్తుచేసుకున్నారు. తాను కొనుగోలు చేయాలనుకున్న ఒక జగపతి బాబు సినిమా పంపిణీకి కూడా ఎవరూ ఆసక్తి చూపలేదని, “ఆ హీరోయిన్ గుడ్డిది, అది ఆడదు” వంటి వ్యాఖ్యలు వినాల్సి వచ్చిందని తెలిపారు.
ఇది కూడా చదవండి :
ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ
అనూహ్యంగా, దివంగత లెజెండరీ నిర్మాత ఎం.ఎస్.రెడ్డి గారి నుంచి పిలుపు వచ్చిందని, ఆయన తనతో భాగస్వామ్యం కావాలని అడగడం తనను ఆశ్చర్యపరిచిందని దిల్ రాజు పేర్కొన్నారు. ఎం.ఎస్.రెడ్డి వంటి వ్యక్తి తనతో పార్ట్‌నర్‌షిప్ అడగడం తన కెరీర్‌కు ఒక మలుపు అని ఆయన అన్నారు. ఆ చిత్ర డిస్ట్రిబ్యూషన్ కోసం ఎం.ఎస్.రెడ్డి 50శాతం వాటా తీసుకోవడానికి అంగీకరించి, తాను రూ.12 లక్షలు, దిల్ రాజు రూ.12 లక్షలు పెట్టుబడిగా పెట్టేలా ఒప్పందం కుదిరింది.
ఇది కూడా చదవండి :
చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్
అలాగే తన కెరీర్‌లో దిల్ వంటి విజయం సాధించిన తర్వాత కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తరుణ్ నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమా దిల్ లాభాలను పోగొట్టిందని, ఆ తర్వాత జై సినిమాతో భారీ నష్టాలను చవిచూశానని దిల్ రాజు వివరించారు. అయితే, ప్రతిసారి కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక అద్భుతం జరుగుతుందని, జై నష్టాల తర్వాత ఆర్య చిత్రం వచ్చి తనను నిలబెట్టిందని ఆయన తెలిపారు. డబ్బును కాకుండా, విజయాన్ని ప్రేమించాలని, విజయవంతమైన సినిమాల ద్వారా వచ్చే డబ్బే తనకు ముఖ్యమని దిల్ రాజు అన్నారు. ఘర్షణలు వచ్చినప్పుడు, వ్యక్తుల ప్లస్‌లు, మైనస్‌లు విశ్లేషించి, అవసరమైతే దూరం పెడతానని, కానీ పోట్లాటలకు దిగనని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి :
ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




