Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాల నటుడుగా కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఓవైపు అమ్మాయిల కలల రాకుమారుడిగా మరోవైపు మాస్ ప్రేక్షకులకు ఆరాధ్య హీరోగా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు మహేష్. తన అద్భుత నటన, అందంతో ప్రేక్షకులను అలరిస్తోన్న మహేష్ క్రేజ్ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఉంటుంది. ట్విట్టర్‌లో మహేష్ బాబును ఏకంగా 12 మిలియన్ మంది ఫాలో అవుతుండడం విశేషం. భారతదేశంలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న అతికొద్ది మంది హీరోల్లో మహేష్‌బాబు ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.
ఇక ట్విట్టర్‌లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న మహేష్ తాజాగా మరో అరుదైన ఘనతను సాధించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసే ఒక్కో ట్వీట్‌కు ఎక్కువ లైక్స్ పొందిన వ్యక్తిగా మహేష్ బాబు రికార్డును సొంతం చేసుకున్నారు. లక్ష లైక్‌లకు పైగా లైక్స్ ఉన్న 30 ట్విట్‌లతో మహేష్ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్న మహేష్ కొత్త ఏడాది వేడుకలు అక్కడే జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోకు కూడా లక్ష లైక్‌లు రావడం విశేషం. మహేష్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌కు ఇంతకంటే రుజువు ఇంకేంటని ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మోకాలి సర్జరీ తర్వాత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ చిన్న గ్యాప్ తర్వాత ఫిబ్రవరి నుంచి జరిగే రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారనే విషయం తెలిసిందే.
Trust the magic of new beginnings! Be happy, be kind, be grateful! Happy New Year 2022! Stay safe everyone. Love you all ❤️🤗 pic.twitter.com/imt6vXH0yW
— Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2021
Health Tips: ఈ సమస్యలు మీకున్నాయా.. అయితే మీరు పసుపు తినకూడదు.. లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవు..!
Weight Loss Diet: బరువు తగ్గాలంటే మూంగ్ దాల్ సూప్ తాగాల్సిందే.. ఎలా తయారు చేయాలంటే?