Bheemla Nayak: భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో నిలవడం లేదా.? దానికి ఇదే నిదర్శనమా..
Bheemla Nayak: కరోనా సెకండ్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడం.. పుష్ప, అఖండ వంటి చిత్రాలు విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మళ్లీ పాత పరిస్థితులు వచ్చాయని అంతా సంతోషించారు...
Bheemla Nayak: కరోనా సెకండ్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడం.. పుష్ప, అఖండ వంటి చిత్రాలు విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మళ్లీ పాత పరిస్థితులు వచ్చాయని అంతా సంతోషించారు. కొత్త ఏడాదిలో కూడా ఇదే ఊపు కొనసాగుతుందని అంతా ఆశించారు. అందుకు అనుగుణంగా ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాల విడుదలకు సంబంధించిన వార్తలు కూడా ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసింది. కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై ప్రభావం చూపనుందా అన్న అనుమానులు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో సినిమాల విడుదలపై డైలమా నెలకొంది.
ఇదిలా ఉంటే టాలీవుడ్‌కి కలిసొచ్చే సంక్రాంతికి భీమ్లానాయక్, సర్కారు వారి పాట, ఎఫ్3 చిత్రాలు విడుదల కావాల్సి ఉండగా. ఆర్‌ఆర్‌ఆర్ విడుదలవుతోందన్న నేపథ్యంలో ఈ మూడు సినిమాలు వాయిదా వేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పోస్ట్‌పోన్ కావడంతో మిగతా చిత్రాల విడుదలపై వార్తలు వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రం, ఆర్‌ఆర్‌ఆర్ వాయిదా పడడంతో భీమ్లా నాయక్ అంతకు ముందు ప్రకటించినట్లు జనవరి 12న విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే తాజాగా ఓ చిన్న సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో నిలవదనే వాదనకు బలం చేకూరింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ‘డిజె టిల్లు’ సినిమాను జవనరి 14న విడుదల చేయనున్నారు. దీంతో పవన్ సినిమా వాయిదాను అనివార్యంగా మారనుంది. దీనికి కారణం భీమ్లా నాయక్ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థే ‘డిజె టిల్లు’ను కూడా నిర్మించడం.
Elephants Attack: చిత్తూరులో ఏనుగుల గుంపు బీభత్సం.. పంటలు నాశనం చేస్తూ చెరువుల్లో తిష్ట!