AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise : ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్.. రాకేష్ మాస్టర్‏కు నివాళీ.. గద్దర్ పాటతో షో స్టార్ట్..

ఎట్టకేలకు టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ అడియన్స్ ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దివంగత ప్రముఖులు కోట శ్రీనివాస రావు, గద్దర్ లతోపాటు దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కు చిత్రయూనిట్ నివాళులర్పించింది.

The Paradise : ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్.. రాకేష్ మాస్టర్‏కు నివాళీ.. గద్దర్ పాటతో షో స్టార్ట్..
The Paradise
Rajitha Chanti
|

Updated on: Sep 24, 2026 | 12:22 PM

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. తెలుగుతోపాటు కన్నడ, మమలయాళ, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. అయితే ఈ సినిమాలో కథతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రధాన అంశం ఉంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ సినిమాలోని కేసీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్య పాత్రలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. అలాగే దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌కు నివాళి అందించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ది ప్యారడైజ్ టీమ్ ఇటీవల కాలంలో మరణించిన సినీ ప్రముఖులకు స్పెషల్ ట్రిబ్యూట్ ఇచ్చింది. దివంగత నటులు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, నిర్మాతలు రామోజీ రావు, దర్శకుడు భారతీ రాజా, గాయనీమణులు జానకి, లతా మంగేష్కర్, ఆశా భోస్లే, తెలంగాణ గాయకుడు దేవరకొండ భిక్షపతి, ఉద్యమకారుడు గద్దర్ లను గుర్తు చేసుకోవడంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. అలాగే వీరందరితోపాటు దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కు సైతం నివాళీ అందించడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ప్రముఖులకు నివాళీ..

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావులను పోలీన పాత్రలను సైతం పెట్టారు. ఎమ్మెల్యే శంకర్ అనే పాత్రలో ప్రియదర్శి లుక్ కేసీఆర్ ను గుర్తు చేసేలా డిజైన్ చేశారు. ఇక కేసీఆర్ డైలాగ్స్.. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు సినిమాలో ఆకట్టుకున్నాయి. అలాగే లక్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ పి. విజయ్ కుమార్ సైతం ఎన్టీఆర్ పాత్రలో కనిపించారు. మొత్తానికి సినిమా మొదటి నుంచి చివరి ప్రేక్షకుడిని ఆకట్టుకున్న సీన్స్, డైలాగ్స్ చాలానే ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

కేసీఆర్ వీడియో..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us