AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బతికున్నప్పుడే కాదు.. చావులోనూ తప్పని తిప్పలు.. పొంగిపొర్లుతున్న వాగులోనే అంతిమ యాత్ర!

ఆధునిక కాలంలో సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, మారుమూల గ్రామాల్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కరువవుతూనే ఉన్నాయి. బతికున్నప్పుడు తాగడానికి నీరు, నడవడానికి సరిగా రోడ్డు లేక ఇబ్బందులు పడే గ్రామీణులు.. చివరికి చనిపోయిన తర్వాత స్మశానవాటికకు వెళ్లేందుకు కూడా నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

బతికున్నప్పుడే కాదు.. చావులోనూ తప్పని తిప్పలు.. పొంగిపొర్లుతున్న వాగులోనే అంతిమ యాత్ర!
Funeral Procession Through A Flooded Stream
Jyothi Gadda
|

Updated on: Sep 24, 2026 | 12:14 PM

Share

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దకాథ గ్రామంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలకు చివరి ప్రయాణంలోనూ కష్టాలు తప్పడం లేదు. దత్తిరాజేరు మండలం పెద్దకాథ గ్రామంలో స్మశానవాటికకు సరైన రహదారి సౌకర్యం లేదు. గ్రామానికి, స్మశానవాటికకు మధ్య ఏడుంపుల గెడ్డ అనే వాగు అడ్డంగా ప్రవహిస్తోంది. మామూలు రోజుల్లో ఎండిపోయి ఉండే ఈ వాగు, వర్షాకాలంలో మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి మృతదేహాలను ఈ వాగు గుండా మోసుకెళ్లడం గ్రామస్థులకు నిత్య ప్రహసనంగా మారింది.

గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ చలిని తట్టుకోలేక గ్రామానికి చెందిన సామిరెడ్డి పరదేశమ్మ (65), నింగిరెడ్డి లక్ష్మునాయుడు (63) అనే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఒకే గ్రామంలో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో ఊరిలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.

వర్షాల వల్ల ఏడుంపుల గెడ్డ వాగు నిండుగా ప్రవహిస్తోంది. వేరే మార్గం లేకపోవడంతో గ్రామస్థులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని, ఉధృతంగా పారుతున్న వాగు దాటుతూ ఇద్దరి మృతదేహాలను స్మశానవాటికకు తరలించారు. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించిపోయాయి. బతికినంత కాలం సౌకర్యాలు లేక నరకం చూశామని, కనీసం చనిపోయిన తర్వాతైనా మనశ్శాంతిగా సాగనంపేందుకు సరైన దారి లేకపోవడం దారుణమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఏళ్లుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పెద్దకాథ గ్రామంలో స్మశానవాటికకు సరిపడా రహదారి మరియు వాగుపై బ్రిడ్జ్ నిర్మించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!