AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దమ్ముంటే మా వాళ్లతో తలపడే టీంలో ఆ ప్లేయర్‌కు చోటివ్వండి.. గంభీర్‌కు సవాల్ విసిరిన కివీస్ కోచ్

Rob Walter Challenges Vaibhav Suryavanshi: టీం ఇండియా-న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశిపై ఆయన సవాల్ విసిరారు. న్యూజిలాండ్ పిచ్‌లపై వైభవ్ ఆటలు సాగవని, బౌన్సర్లతో ఒత్తిడిలోకి నెట్టేస్తామని వాల్టర్ హెచ్చరించారు. అయితే ఒత్తిడిని తట్టుకుని రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు.

దమ్ముంటే మా వాళ్లతో తలపడే టీంలో ఆ ప్లేయర్‌కు చోటివ్వండి.. గంభీర్‌కు సవాల్ విసిరిన కివీస్ కోచ్
Rob Walter Challenges Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Sep 24, 2026 | 12:16 PM

Share

Rob Walter Challenges Vaibhav Suryavanshi: టీం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 22వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య వన్డేలు, టి20లు, టెస్టులు జరగనున్నాయి. దసరా తర్వాత ప్రారంభమయ్యే ఈ మూడు సిరీస్‌లలో ముందుగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలవుతుంది. మధ్యాహ్నం 12:30 నిమిషాలకి ఈ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈలోగా టీం ఇండియా వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లోనూ, ఆసియా క్రీడలలోనూ తలపడనుంది.

ఈ కీలక సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టీం ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని లక్ష్యంగా చేసుకుని ఆయన ఒక రకమైన సవాల్ విసిరారు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం వైభవ్ సూర్యవంశీ గురించే ఆలోచిస్తుందని, అతని బ్యాటింగ్ చూడడం కోసం చాలామంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారని రాబ్ వాల్టర్ అన్నారు. వైభవ్ బ్యాటింగ్ చేసినా, అవుట్ అయినా అది ఒక సంచలనమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కువమంది చదివినది: ఒక్కో మ్యాచ్‌కు రూ. 19 కోట్లకుపైగానే.. ఖాళీ చేతులతో వచ్చి ఎన్ని కోట్లు పట్టుకెళ్లారంటే?

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో వచ్చే నెలలో తమతో ఆడే టీం ఇండియా తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు లభిస్తే, అతన్ని ఎదుర్కోవడానికి తమ జట్టు పక్కా వ్యూహాలను అమలు చేస్తుందని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధీమా వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ పిచ్‌లపై వైభవ్ ఎలా ఆడతాడో చూడాలని తనకు ఆత్రుతగా ఉందని వాల్టర్ పేర్కొన్నారు. ఇండియాలో ఉన్న పరిస్థితులకు, న్యూజిలాండ్‌లోని పరిస్థితులకు చాలా భిన్నమని ఆయన విశ్లేషించారు. ఇండియాలో సాధారణంగా ఫ్లాట్ ట్రాక్‌లు ఉంటాయని, అక్కడ భారీ స్కోర్లు నమోదు కావడం చాలా సందర్భాల్లో చూశామని అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణించి ప్రేక్షకులను అలరించాడని తనకు తెలుసునని వాల్టర్ తెలిపారు.

ఎక్కువమంది చదివినది: వీళ్లంతా భారత్‌లోనే హీరోలు.. విదేశాల్లో జీరోలు.. టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

అయితే, న్యూజిలాండ్ పిచ్‌ల విషయానికి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని రాబ్ వాల్టర్ హెచ్చరించారు. న్యూజిలాండ్ పిచ్‌లపై వైభవ్ సూర్యవంశీ ఆటలు సాగవని, అతన్ని తీవ్రంగా ఒత్తిడిలోకి నెట్టి బౌన్సర్లతో టార్చర్ చేస్తామని న్యూజిలాండ్ కోచ్ స్పష్టం చేశారు. స్వదేశంలో వైభవ్ చూపించిన ఆధిపత్యం న్యూజిలాండ్ గడ్డపై కొనసాగదని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ఈ తీవ్రమైన ఒత్తిడిని తట్టుకొని వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణిస్తే, అతనికి అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తన అభిప్రాయాన్ని ముగించారు. ఈ వ్యాఖ్యలు రానున్న సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us