Thandav Controversy: జనవరి 15న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్ అయూబ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ సినిమాను తెరకెక్కించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఈ సినిమాలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ వెబ్ సిరీస్ ఉందంటూ భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబయిలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు ప్రదర్శనను నిలిపివేయాలంటూ భాజపా ఎంపీ మనోజ్‌కుమార్ కొటక్ కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్‌కు లేఖ రాశారు. మరోవైపు వెబ్‌సిరీస్‌పై వ్యతిరేకత పెరగడంతో ముందస్తు జాగ్రత్తగా ముంబయి శివారులో ఉన్న సైఫ్ ఇంటివద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ బ్యాన్ తాండవ్, బాయ్‌కాట్‌తాండవ్ పేరుతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Sai Pallavi In Tejas Alivelumanga : తేజ సినిమాలో ఫిదా భామ? యాక్షన్ హీరో సరసన తొలిసారిగా అవకాశం..