ఎస్పీబీకి తెలుగు సంగీత పరిశ్రమ ప్రత్యేక నివాళి
కరోనాను జయించినప్పటికీ, అనారోగ్య కారణాలతో గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గత నెల 25న మనల్ని వదిలి వెళ్లిపోయారు

Tribute to SPB: కరోనాను జయించినప్పటికీ, అనారోగ్య కారణాలతో గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గత నెల 25న మనల్ని వదిలి వెళ్లిపోయారు. అయినా పాట బతికినన్ని రోజులు ఆయన మన మధ్యలోనే ఉంటారు. కాగా ఆయన కన్నుమూసి 16 రోజులు అవుతుండగా.. ఇప్పటికీ అభిమానులు బాలు ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు నివాళి ఇచ్చేందుకు తెలుగు సంగీత పరిశ్రమ ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టబోతోంది.
హైదరాబాద్‌కి చెందిన సందీప్ గుడి అనే ఈవెంట్ ఆర్గనైజర్ ఎస్పీబీకి నివాళులు ఇచ్చేందుకు వర్చువల్ కన్సర్ట్‌ని నిర్వహించబోతున్నారు. ఎస్పీబీ శిష్యుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆధ్వర్యంలో ఈ కన్సర్ట్ జరగనుంది. ఇందులో 30 మంది గాయకులు పాల్గొనబోతున్నారు. 12 గంటల పాటు వీరు పాటలను పాడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో వివిధ సమయాల్లో ఈ కన్సర్ట్ ప్రసారం కానుంది. ఇందులో చిత్ర, హేమచంద్ర, రేవంత్, గీతా మాధురి తదితరులు భాగం అవ్వనున్నారు.
Read More:
ఏపీలో ‘నాగ సొరకాయల’ పేరిట లక్షల్లో మోసం.. 21 మంది అరెస్ట్
15 ఏళ్ల తరువాత దిల్ రాజు ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడా..!