Thriller Movie: 6.5 రేటింగ్.. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ అదుర్స్ అంతే.. ఎక్కడ చూడొచ్చంటే..?
ఓటిటీలో విభిన్న కంటెంట్‌తో హారర్ థ్రిల్లర్ సినిమాలు అలరిస్తున్నాయి. పాత సినిమాల సంగతి వదిలేయండి. ఆ జోనర్‌కే చెందిన ఓ పాత సినిమా డీటేల్స్ మీ కోసం తీసుకొచ్చాం. ఒళ్ళు గగుర్పొడిచే ట్విస్టులతో రూపొందిన ఈ సినిమా... రాహుల్ సాంకృత్యాన్ డెబ్యూట్ మూవీ.

ఓటీటీల్లో ఈ మధ్య ఎక్కువగా హారర్ థ్రిల్లర్స్ హవా చూపిస్తున్నాయి. కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులకి భయాన్ని, ఉత్కంఠను కలిగించే ఈ సినిమాలు మరింత ఆదరణ పొందుతున్నాయి. అలాంటి సినిమాలు ఏ ప్లాట్‌ఫాంలో ఉన్నా.. మూవీ లవర్స్ వదిలిపెట్డడం లేదు. అలాంటివారి కోసమే ఓ ఇంట్రస్టింగ్ అండ్ ఎంగేజింగ్ మూవీని రిఫర్ చేయబోతున్నాం. ‘ది ఎండ్’ సినిమా సూపర్ ఉంటుంది. నాని ‘శ్యామ్ సింగరాయ్’తో తన మార్క్ చూపించిన రాహుల్ సాంకృత్యాన్ కెరీర్‌కి ఆరంభం ఇచ్చిన సినిమా ఇదే. 2014లో విడుదలైన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ బాగా మెప్పిస్తుంది. చిన్న బడ్జెట్‌తో వచ్చినా స్ట్రాంగ్ స్టోరీ లైన్, గమ్మత్తైన స్క్రీన్ ప్లేతో మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఈ సినిమాకి IMDbలో 6.5/10 రేటింగ్ వచ్చింది. అంతే కాదు, స్టార్ మా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచి సినీ విమర్శకులు ప్రశంసలు కూడా అందుకుంది. గూగుల్‌లో 94% మంది యూజర్లు ది ఎండ్ సినిమాను లైక్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో లేదు. కానీ iDream యూట్యూబ్ ఛానెల్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. రెండు గంటల 28 నిమిషాల ఈ సినిమా హారర్ ప్రేమికుల కోసం ఓ మంచి ట్రీట్ అని చెప్పవచ్చు.
హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లో ఓ ఐసోలేటెడ్ విల్లా… అక్కడ కొత్త జీవితం మొదలుపెట్టిన భార్యాభర్తలు రాజీవ్ (సుధీర్ రెడ్డి), ప్రియా (పావని రెడ్డి). అంతా ప్రశాంతం అనుకున్న ఆ ఇంట్లో అనూహ్య ఘటనలు మొదలవుతాయి. మధ్యలో యూకే నుంచి గౌతమ్ (యువ చంద్ర) భారత్‌కు వస్తాడు – ఆయన వాళ్ల కామన్ ఫ్రెండ్. ఒకరోజు రాజీవ్ నుంచి గౌతమ్‌కి ఫోన్ వస్తుంది: “ప్రియకు దెయ్యం పట్టింది.. వచ్చి చూసేయ్”. ఆ తర్వాత ఆ ఇంట్లో జరిగే పరిణామాలు… నిజంగా దెయ్యమా? మానసిక కారణాలా? ప్రియ, రాజీవ్, గౌతమ్ మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటి? అన్న పాయింట్స్‌తో సినిమా అంతా మంచి ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఒక హారర్ కామెడీ థ్రిల్లర్‌గా సాగిపోతూ… చివరికి ఓ షాకింగ్ క్లైమాక్స్‌కి తీసుకెళ్తుంది. అలా మనుషుల మధ్య నమ్మకాన్ని బద్దలుకొట్టే దెయ్యం ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే… ఇప్పుడే యూట్యూబ్‌లో “The End Telugu Full Movie” అని సెర్చ్ చేసి చూసేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



