విజయ్ మాల్యాపై వెబ్ సిరీస్.. దక్షిణాది నటుడు నటించబోతున్నారా?
ఇప్పుడు విజయ మాల్యా పాత్రలో నటించేందుకు ఓ ప్రముఖ నటుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. దక్షిణాది నటుడిని ఈ పాత్రలో కోసం సంప్రదిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. అందుకు ఆ నటుడు కూడా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు..
ప్రముఖ పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ మాల్యా లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కబోతుంది. ఇందుకు సంబంధించిన కథ కోసం నిర్మాణ సంస్థ అల్మైటీ మోషన్ పిక్చర్స్ ‘ది విజయ మాల్యా స్టోరీ’ పుస్తక రచయిత నుంచి హక్కులను కొనుగోలుచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు నటి, నిర్మాత ప్రబ్లీన్ కౌర్. ది విజయమాల్యా స్టోరీ’ బుక్‌ని ప్రముఖ రచయిత కే గిరిప్రకాశ్ రాయగా.. పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. విజయమాల్యా పుట్టిన దగ్గర నుంచి అతడు యూకే పారిపోయినంతవరకు సంబంధించిన వివరాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజీలో ఉంది.
ఇప్పుడు విజయ మాల్యా పాత్రలో నటించేందుకు ఓ ప్రముఖ నటుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. దక్షిణాది నటుడిని ఈ పాత్రలో కోసం సంప్రదిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. అందుకు ఆ నటుడు కూడా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించబోతుంది అల్మైటీ సంస్థ. ఇక మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది మూవీ యూనిట్. ఈ వెబ్‌సిరీస్‌ను ఎమ్ఎక్స్ ప్లేయర్లో రిలీజ్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది అల్మైటీ మోషన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ.
Read More:
సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా