రెబల్‌స్టార్‌ ‘ఆదిపురుష్’‌.. అప్‌సెట్‌ అయిన కరణ్‌

ఆదిపురుష్‌తో ఫ్యాన్స్‌కి ప్రభాస్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓమ్ రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీతో రెబల్ స్టార్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు

రెబల్‌స్టార్‌ 'ఆదిపురుష్'‌.. అప్‌సెట్‌ అయిన కరణ్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 20, 2020 | 1:27 PM

Karan upset with Prabhas: ఆదిపురుష్‌తో ఫ్యాన్స్‌కి ప్రభాస్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓమ్ రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీతో రెబల్ స్టార్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్‌, ఓమ్‌ రౌత్‌, ప్రసాద్‌ సూతర్‌, రాజేష్ నాయర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ తరువాత బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కాస్త అప్‌సెట్‌ అయినట్లు తెలుస్తోంది.

బాహుబలితో ప్రభాస్‌కి మంచి క్రేజ్ రాగా.. ఈ మూవీ తరువాత అతడిని హిందీ పరిశ్రమలోకి తీసుకెళ్లేందుకు పలువురు నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. వారిలో కరణ్ జోహార్ కూడా ఒకరు. బాహుబలిని హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసిన కరణ్‌, అతడితో ఓ సినిమాకు ప్లాన్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ మధ్యలోనే కరణ్‌ ఆఫర్‌ని ప్రభాస్ రిజెక్ట్ చేసినట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. వాటికి బలం చేకూరుస్తూ కరణ్ ఓ ట్వీట్ వేయగా.. అది ప్రభాస్‌ని ఉద్దేశించి చేసిందేనని చాలా మంది భావించారు. ఇక ఇప్పుడు ప్రభాస్‌, టీ-సిరీస్‌తో టై అప్ అవ్వగా.. ఆ విషయంపై కరణ్‌ కాస్త అప్‌సెట్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు సుశాంత్ మృతి తరువాత కరణ్‌పై నెగిటివిటీ పెరిగింది. ఈ క్రమంలో ప్రభాస్‌, కరణ్‌ని పక్కన పెట్టి మంచి పని చేశాడని పలువురు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

Read More:

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌.. మూడో దశ ట్రయల్స్‌కి గ్రీన్‌సిగ్నల్‌

Breaking: నిలిచిపోయిన జీమెయిల్‌ సేవలు