సూపర్ హిట్ కాంబో.. పవన్ కళ్యాణ్‌తో విజయ్ సేతుపతి..
మలయాళ బ్లాక్ బాస్టర్ సినిమా ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తెలుగులో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. హీరోలుగా చాలామంది పేర్లు వినిపించినప్పటికీ..
Ayyappanum Koshiyum Telugu Remake: మలయాళ బ్లాక్ బాస్టర్ సినిమా ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తెలుగులో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. హీరోలుగా చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. చివరిగా రవితేజ, రానా దగ్గుబాటి దగ్గర వార్తలు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా నటించేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారని వినికిడి. అటు తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా నటిస్తాడని సమాచారం.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నాడని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట. కాగా మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ రోల్ లో పవన్ కళ్యాణ్, బిజు మీనన్ చేసిన పోలీస్ అధికారి పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..
మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..
డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..