సుశాంత్ కేసులోఇక సీబీఐ ఇన్వెస్టిగేషన్, ముంబై కార్పొరేషన్ షరతు
సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దర్యాప్తు సంస్థ అధికారులు ముంబైని సందర్శించి ఈ నగర పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు సాగించిన ఇన్వెస్టిగేషన్ వివరాలను తెలుసుకోనున్నారు.
సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దర్యాప్తు సంస్థ అధికారులు ముంబైని సందర్శించి ఈ నగర పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు సాగించిన ఇన్వెస్టిగేషన్ వివరాలను తెలుసుకోనున్నారు. కేసు డైరీని, ఎలెక్ట్రానిక్ ఎవిడెన్స్, హాస్పిటల్ నుంచి సేకరించిన పోస్ట్ మార్టం రిపోర్ట్, తదితరాలను వారు స్టడీ చేస్తారు. అలాగే సుశాంత్ ఇంటిని విజిట్ చేసి అక్కడ సూసైడ్ సీన్ రీక్రియెట్ చేయనున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజున ఎవరెవరు ఆ ఇంటిలో ఉన్నారు మొదలైన అంశాలపై వారు దృష్టి పెట్టనున్నారు. ఈ కేసులో ముంబై పోలీసుల నుంచి తమకు పూర్తి సహకారం అందగలదని వారు ఆశిస్తున్నారు.
ఇలా ఉండగా.. సీబీఐ బృందం ముంబైలో ఉండాలనుకుంటే హోం క్వారంటైన్ నుంచి మినహాయింపునకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షరతు విధించారు. లోగడ పాట్నా నుంచి కేసు దర్యాప్తునకు వచ్చిన ఓ పోలీసు అధికారిని వారు బలవంతంగా క్వారంటైన్ కి తరలించారు.