మరికాసేపట్లో..స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రకటన
ప్రధాని నరేంద్రమోదీ మరికాసేట్లో స్వచ్ఛ సర్వేక్షణ్ -2020 అవార్డులను ప్రకటించనున్నారు. 'స్వచ్ఛ మహోత్సవ్' పేరుతో ఈ కార్యక్రమంలో మొత్తం 129 అవార్డులను అగ్రశ్రేణి నగరాలు, రాష్ట్రాలకు అందజేయనున్నారు....
Government to Announce Swachh Survekshan 2020 : ప్రధాని నరేంద్రమోదీ మరికాసేట్లో స్వచ్ఛ సర్వేక్షణ్ -2020 అవార్డులను ప్రకటించనున్నారు. ‘స్వచ్ఛ మహోత్సవ్’ పేరుతో ఈ కార్యక్రమంలో మొత్తం 129 అవార్డులను అగ్రశ్రేణి నగరాలు, రాష్ట్రాలకు అందజేయనున్నారు. అదేవిధంగా స్వచ్ భారత్ మిషన్-అర్బన్ ఆధ్వర్యంలోని ఎంపిక చేసిన లబ్ధిదారులు, సఫాయికార్మికులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని స్వచ్ఛ సర్వేక్షన్ 2020 ఫలితాల డాష్‌బోర్డ్‌ను ఆవిష్కరిస్తారు. స్వచ్ఛ్ సర్వేక్షన్ 2020 ప్రపంచంలోనే అతిపెద్ద పరిశుభ్రత సర్వే.ఇందులో మొత్తం 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 92 గంగా పట్టణాలను అదేవిధంగా 1.87 కోట్ల పౌరుల భాగస్వామ్యాంతో ఇది ఏర్పడింది.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ – 2020 పోటీల్లో తెలంగాణ నుంచి రెండు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్‌లు పురస్కారానకి ఎంపికయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్‌తో పాటు కరీంనగర్, జహీరాబాద్ అర్బన్ నగరాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ దుర్గాశంకర్ మిశ్రా అవార్డులకు ఎంపికైన మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ల పేర్లను ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో పాల్గొన్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లలో మెరుగైన ర్యాంకులు సాధించిన 100 మునిసిపాలిటీలను కేంద్రం ఎంపిక చేసింది. మరికాసేపట్లో ర్యాంకులు ప్రకటిస్తారు.