AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్‌బాస్‌’గా అర్జున్ రెడ్డి..?

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ మూడో సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. జూలై నుంచి ఈ షోను ప్రారంభించాలని భావిస్తున్న నిర్వాహకులు హోస్ట్‌గా ఎన్టీఆర్‌ను పెట్టాలని విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్‌’కు ఇచ్చిన కమిట్మెంట్ వలన ఎన్టీఆర్ ఈ షోను దూరం పెట్టేయగా.. మరో స్టార్ హీరో కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో నాగార్జున, వెంకటేశ్ ఇలా పలువురి పేర్లు బిగ్‌బాస్ హోస్ట్‌ లిస్ట్‌లో ఉండగా.. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది. యూత్‌లో విజయ్‌కు చాలా […]

‘బిగ్‌బాస్‌’గా అర్జున్ రెడ్డి..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 21, 2019 | 11:59 AM

Share

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ మూడో సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. జూలై నుంచి ఈ షోను ప్రారంభించాలని భావిస్తున్న నిర్వాహకులు హోస్ట్‌గా ఎన్టీఆర్‌ను పెట్టాలని విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్‌’కు ఇచ్చిన కమిట్మెంట్ వలన ఎన్టీఆర్ ఈ షోను దూరం పెట్టేయగా.. మరో స్టార్ హీరో కోసం వెతుకుతున్నారు.

ఈ క్రమంలో నాగార్జున, వెంకటేశ్ ఇలా పలువురి పేర్లు బిగ్‌బాస్ హోస్ట్‌ లిస్ట్‌లో ఉండగా.. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది. యూత్‌లో విజయ్‌కు చాలా క్రేజ్ ఉంది. దీంతో ఆయనను తీసుకుంటే షోకు భారీ మైలేజ్ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు వారు సిద్ధమైనట్లు కూడా సమాచారం. అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో ‘బిగ్‌బాస్‌’పై విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us