బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది సోనియా ఆకుల. అంతకు ముందు ఆమె కొన్ని సినిమాల్లో నటించినా పెద్ద గుర్తింపు రాలేదు. అయితే ఎప్పుడైతే సోనియా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందే అప్పటి నుంచే తన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. అందుకు తగ్గట్టుగానే షో ప్రారంభంలో తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. అయితే పోనూ పోనూ ఆమె ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా నిఖిల్, పృథ్వీల విషయంలో సోనియా ప్రవర్తించిన తీరుపై బిగ్ బాస్ ఆడియెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా చివరి వరకు హౌస్ లో ఉంటుందనుకున్న సోనియా నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా సోనియా పేరు బాగా వినిపిస్తోంది. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ షో పై సోనియా చేస్తోన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తన మాటలను ఇష్టమొచ్చినట్లు ఎడిట్ చేసి చూపించారంటూ మండి పడుతోంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ రివ్యూయర్ ఆదిరెడ్డిపై కూడా మండిపడిందీ ముద్దుగుమ్మ. రివ్యూల పేరుతో తనను కించపరిచేలా మాట్లాడాలంటూ ఆదిరెడ్డి మీద కేసు పెట్టినట్లు చెప్పుకొచ్చింది.
‘నా వల్ల నెలరోజుల పాటు రివ్యూవర్లు బాగా బతికారు. నా గురించి వీడియోలు చేసుకుంటూ చాలామంది బాగానే వెనకేసుకున్నారు. ఇక బిగ్ బాస్ షో కూడా ఈ 30 రోజులు నా వల్లే రేటింగ్‌తో బతికి బట్ట కట్టింది. వాళ్లందరికీ ఇంతటి మంచి ఆదాయం సమకూర్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అలాగే నా వల్ల సుమారు 40 మంది కొత్త యూట్యూబర్లకు బతుకు దెరువు దొరకింది. నేను ఎక్కడున్నా తిండి పెట్టే పనిలోనే ఉంటాను’
‘ఇక ఆది రెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడాడు. రివ్యూల పేరుతో నన్ను కించపరిచాడు. ఈ విషయం గురించి అతనిపై పోలీస్ కేసు పెడదామనుకున్నాను. ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని నా కుటుంబ సభ్యులు చెప్పడంతో కేసు విషయంలో కాస్త తగ్గాను’ అని సోనియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిపై అభిమానులు, నెటిజన్ల నుంచి భిన్న రకాల స్పందనలు వస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి