AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వేదాళం’ రీమేక్.. చిరంజీవికి చెల్లెలుగా హైబ్రిడ్ పిల్ల.!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం 'వేదాళం'. ఈ మూవీ కోలీవుడ్‌లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఎప్పటిచంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

'వేదాళం' రీమేక్.. చిరంజీవికి చెల్లెలుగా హైబ్రిడ్ పిల్ల.!
Ravi Kiran
|

Updated on: Sep 10, 2020 | 6:38 PM

Share

Vedalam remake: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం ‘వేదాళం’. ఈ మూవీ కోలీవుడ్‌లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఎప్పటిచంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ చిరు పుట్టినరోజు నాడే రాకారణాల వల్ల అది జరగలేదు. .

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా హీరోయిన్ సాయి పల్లవి నటించబోతోందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. మాతృకలో లక్ష్మీ మీనన్ అజిత్ చెల్లి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర తెరకెక్కించబోతున్నట్లు వినికిడి.