‘భారతీయుడు 2’పై మళ్లీ పుకార్లు..?

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’పై పుకార్లు ఆగడం లేదు. ఈ సినిమా ఆగిపోయిందంటూ గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. మూవీ బడ్జెట్ విషయంలో నిర్మాతలకు, దర్శకులకు పొసగడం లేదని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ మూవీని ఆపివేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదటి షెడ్యూల్ కోసం నిర్మాతలు రెండున్నర కోట్లు అనుకోగా.. ఆరు కోట్లు ఖర్చయిందట. పైగా ముందుగా అనుకున్న మొత్తం కూడా […]

‘భారతీయుడు 2’పై మళ్లీ పుకార్లు..?
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 1:23 PM

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’పై పుకార్లు ఆగడం లేదు. ఈ సినిమా ఆగిపోయిందంటూ గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. మూవీ బడ్జెట్ విషయంలో నిర్మాతలకు, దర్శకులకు పొసగడం లేదని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ మూవీని ఆపివేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మొదటి షెడ్యూల్ కోసం నిర్మాతలు రెండున్నర కోట్లు అనుకోగా.. ఆరు కోట్లు ఖర్చయిందట. పైగా ముందుగా అనుకున్న మొత్తం కూడా తీయలేకపోయారట. కమల్ మేకప్‌కు ఎక్కువ సమయం పడుతోందని, అందుకే షూటింగ్ సరిగా జరగడం లేదని తెలుస్తోంది. మరోవైపు కమల్ ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుండటంతో తనకు చెప్పిన పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఇలానే కొనసాగితే బడ్జెట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న నిర్మాతలు సినిమాను ఆపేయాలా ముందుకు తీసుకెళ్లాలా అని చర్చలు జరుపుతున్నారట.