AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dmart: డీ మార్ట్‌కు వెళ్లేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే మీ బిల్లు డబ్బులు ఆదా.. చాలామంది చేసే తప్పులు ఇవే..

డీమార్ట్‌కు తరచూ వేలాదిమంది వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఇవి ఎక్కడికక్కడ వెలిశాయి. దీంతో తక్కువ ధరకే సరుకులు దొరుకుతుండటంతో చాలామంది ఇక్కడికి వెళ్తుంటారు. అయితే ఆఫర్లు చూసి అవసరం లేని వస్తువులు కొంటారు. దీని వల్ల బిల్లు ఎక్కువగా వస్తుంది.

Dmart: డీ మార్ట్‌కు వెళ్లేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే మీ బిల్లు డబ్బులు ఆదా.. చాలామంది చేసే తప్పులు ఇవే..
Dmart
Venkatrao Lella
|

Updated on: Apr 16, 2026 | 12:34 PM

Share

ఇంట్లోకి సరుకులు కావాలంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు డీమార్ట్. తక్కువ ధరకే ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ దొరుకుతుంది. అంతేకాకుండా వన్ ప్లస్ వన్ ఆఫర్లు, డిస్కౌంట్స్ డీమార్ట్‌లో ఎక్కువగా ఉంటాయి. దీంతో డీమార్ట్‌లు బాగా పాపులర్ అయ్యాయి. అయితే అక్కడ ఉండే ఆఫర్లను చూసి చాలామంది అవసరం లేకున్నా వస్తువులు  కొనుగోలు చేస్తారు. దీని వల్ల బిల్లు ఎక్కువగా వస్తుంది. అయితే మీరు కొన్ని టిప్స్ పాటించడం వల్ల బిల్లును తగ్గించుకోవచ్చు. అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బిల్లు తగ్గించుకోవాలంటే..?

నెలవారీకి అవసరయ్యే సరుకులు కొనుగోలు చేసేందుకు డీమార్ట్‌కు చాలమంది వెళ్తుంటారు. అయితే షాపింగ్ చేసేటప్పుడు కస్టమర్లు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీని వల్ల లాభం కంటే నష్టపోతుంటారు. డీమార్ట్‌కు వెళ్లినప్పుడు షాపింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ముందుగా మీకు ఇంట్లోకి ఏ వస్తువులు అవసరం అనేది ఒక లిస్ట్ రాసుకోండి. ఆ తర్వాతనే షాకింగ్‌కు వెళ్లండి. దీని వల్ల మీకు అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తారు. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఇలా రాసుకోకుండా పోతే ఏది కొనుగోలు చేయాలనే తెలియక తికమక పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆఫర్లను చూసి ఆకర్షితులై అవసరం లేనివి కూడా కొనుగోలు చేస్తారు. దీని వల్ల మీ బిల్లు పెరుగుతుంది.

తక్కువ ధరక సొంత బ్రాండ్లు

ముందుగా డీమార్ట్‌కు వెళ్లగానే మీకు బిస్కెట్లు, చాక్కెట్లు లాంటి తినుబండారాలు కనిపిస్తాయి. తక్కువ ధరకే అవి లభిస్తాయి. మీరు ముందుగా వెళ్లగానే వాటిని కొనుగోలు చేయవద్దు. షాపింగ్ మొత్తం అయ్యాక అవసరం అనుకుంటేనే కొనుగోలు చేయండి. ముందుగా మీకు కావాల్సిన నెల సరుకులు కొనుగోలు చేయండి. బియ్యం, వంట నూనె, ఇతర సరుకులు కొనండి. మీకు రోజువారీగా ఏవి అవసరమో అవే కొనండి. ఇక డీమార్ట్‌లో దుస్తులు తక్కువ ధరకే దొరుకుతాయి. అవసరం ఉంటేనే వాటివైపు వెళ్లండి. ఇక కిచెన్ వేర్ లాంటివి కూడా అవసరమైతేనే కొనుగోలు చేయండి. అవసరం లేని వస్తువులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. దీని వల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయి. డీమార్ట్ సొంత బ్రాండ్లు మరింత తక్కువ ధరకు లభిస్తాయి. వాటిని కొనుగోలు చేయడం వల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయి. ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల డీమార్ట్‌కు వెళ్లినప్పుడు మీరు డబ్బులు వృధా చేసుకోకుండా ఉంటారు. ఈ సారి షాకింగ్‌కు వెళితే ఈ టిప్స్ పాటించండి.

Follow Us
ఇది కదా ఆటంటే.. ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న టీమిండియా!
ఇది కదా ఆటంటే.. ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న టీమిండియా!
ఇతరుల బట్టలు ధరిస్తున్నారా? వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిదేనా?
ఇతరుల బట్టలు ధరిస్తున్నారా? వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిదేనా?
గ్రామంలో వరుస మరణాలు.. భయంతో ఇళ్లు వదిలి అడవి బాట పట్టిన జనాలు
గ్రామంలో వరుస మరణాలు.. భయంతో ఇళ్లు వదిలి అడవి బాట పట్టిన జనాలు
ఎండతో పనిలేదు! నోట్లో వేస్తే కరిగిపోయే సగ్గుబియ్యం అప్పడాలు
ఎండతో పనిలేదు! నోట్లో వేస్తే కరిగిపోయే సగ్గుబియ్యం అప్పడాలు
అడ్వాన్స్‌డ్ ADAS టెక్నాలజీతో కీవే హైప్‌వోల్ట్-ఆర్
అడ్వాన్స్‌డ్ ADAS టెక్నాలజీతో కీవే హైప్‌వోల్ట్-ఆర్
సర్జన్ల కొరతకు హ్యూమనాయిడ్ రోబోలు చెక్ పెడతాయా?
సర్జన్ల కొరతకు హ్యూమనాయిడ్ రోబోలు చెక్ పెడతాయా?
ఆ సినిమాలో బ్రహ్మనందంతో రిస్క్ చేశా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్.
ఆ సినిమాలో బ్రహ్మనందంతో రిస్క్ చేశా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్.
గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఎల్లిపాయ కారం..
గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఎల్లిపాయ కారం..
శాంసంగ్ నుంచి సరికొత్త 'గెలాక్సీ' సిరీస్.. ప్రీ బుకింగ్‌ ఇలా
శాంసంగ్ నుంచి సరికొత్త 'గెలాక్సీ' సిరీస్.. ప్రీ బుకింగ్‌ ఇలా
ఇక్కడ నైవేద్యంగా ఇనుప సుత్తి! కోరిక తీరితే తప్పనిసరిగా సమర్పించే
ఇక్కడ నైవేద్యంగా ఇనుప సుత్తి! కోరిక తీరితే తప్పనిసరిగా సమర్పించే