Bigg Boss Telugu 5: ఆ కంటెస్టెంట్‌ను కావాలనే నెగిటివ్‌గా చూపిస్తున్నారు.. బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్న నెటిజన్లు

బిగ్ బాస్ హౌస్‌లో కావాల్సిన హంగామా నడుస్తుంది. కంటెంస్టెంట్స్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.. బిగ్ బాస్ హౌస్‌ను రణరంగా మారుస్తున్నారు.

Bigg Boss Telugu 5: ఆ కంటెస్టెంట్‌ను కావాలనే నెగిటివ్‌గా చూపిస్తున్నారు.. బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్న నెటిజన్లు
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 7:00 PM

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో కావాల్సిన హంగామా నడుస్తుంది. కంటెంస్టెంట్స్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.. బిగ్ బాస్ హౌస్‌ను రణరంగా మారుస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లో కావాల్సినంత డ్రామా జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నింటిలో ప్రియా -రవి-లహరి మధ్య జరిగిన గొడవ హైలైట్ గా నిలిచింది. రవి లహరి బాత్రూం లో అర్ధరాత్రి సమయంలో హగ్ చేసుకున్నారంటూ ప్రియా సంచలన విషయాన్నీ బయటపెట్టిన విషయం తెలిసిందే.. దాంతో ప్రియా కు లహరి మధ్య చిన్న సైజ్ వారే నడిచింది. ఇక ఈ వ్యవహారంలో రవిని లాగడంతో ఈ రచ్చ మరింత పెద్దదైంది. లహరి -రవి మిడ్ నైట్ రెస్ట్ రూమ్‌లో కౌగిలించుకున్నారంటూ ప్రియా చెప్పడంతో హౌస్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో లహరి ప్రియా పై వాగ్వాదానికి దిగింది. ఆతర్వాత సీన్‌లోకి వచ్చిన రవి కూడా.. ప్రియా పై అరిచేశాడు. వెంటనే రవి అందుకొని ఏంటక్కా ఏమాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. ఇదంతా గతావారమంతా నడిచింది. లహరి హౌస్‌లో ఉన్న అబ్బాయిలతో బిజీగా ఉంటున్నావంటూ ప్రియా మాట్లాడంతో రవి.. లహరి రెచ్చిపోయారు. అంతేకాకుండా.. ఇంట్లో మిగతా సభ్యులంతా ప్రియ మాటలకు షాకయ్యారు.

ఆ తర్వాత లహరి.. రవి దగ్గరకు వెళ్లి .. నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నా అని.. అందుకే మీతో ఉంటున్నా.. సింగిల్ మెన్ అని అన్నారా ? అని ప్రశ్నించగా.. తను ఆ మాటలు అనలేదని.. ప్రియ కావాలనే తనను బ్యాడ్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఆతర్వాత ప్రియా దగ్గరకు వెళ్లి రవి అక్కా నేను ఆ మాటనే అనలేదు అక్క.. నేను సింగిల్ మెన్.. మ్యారీడ్ మెన్ అనే మాట అనలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలో ప్రియా.. లేదు బ్రో నువ్వు అన్నావ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత లహరిని పవర్ రూంకు పంపి.. రవి, ప్రియ ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోను చూపించి లహరికి షాకిచ్చాడు బిగ్‏బాస్. నీకు క్లారిటీ వచ్చింది కదా.. తప్పు ఎవరు చేశారో అన్నాడు నాగ్. దాంతో రవి దోషి అని తేలింది. ఈ తతంగం చూస్తున్న నెటిజన్లు రవిని కావాలనే బ్యాడ్ చేస్తున్నారు.. కావాలనే రవిని నెగిటివ్‌గా ప్రాజెక్ట్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో రవికి మద్దతు పెరుగుతుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో లహరి- ప్రియా ఉన్నారు. ఈ ఇద్దరిలో లహరి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sitara Photos: ఇన్‌స్టాలో సితార ఘట్టమనేని క్రేజ్ మామూలుగా లేదుగా.. లేటెస్ట్ క్యూట్ పిక్స్..

Sampoornesh Babu: మంత్రి అనీల్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన హీరో సంపూర్ణేష్ బాబు.. ఏమన్నారంటే..