Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: 33ఏళ్ల సినీ కెరీర్‌లో 100కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోగా సల్మాన్ రికార్డ్.. మొదటి పారితోషకం ఎంతో తెలుసా..

Salman Khan Remuneration: సినీ పరిశ్రమలో ఇప్పుడు స్టార్ నటీనటులకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇలా కోట్ల రూపాయలను తీసుకుంటున్న నటీనటుల్లో..

Salman Khan: 33ఏళ్ల సినీ కెరీర్‌లో 100కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోగా సల్మాన్ రికార్డ్.. మొదటి పారితోషకం ఎంతో తెలుసా..
Salman Khan
Follow us
Surya Kala

|

Updated on: Sep 26, 2021 | 9:23 AM

Salman Khan Remuneration: సినీ పరిశ్రమలో ఇప్పుడు స్టార్ నటీనటులకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇలా కోట్ల రూపాయలను తీసుకుంటున్న నటీనటుల్లో చాలామంది కెరీర్ మొదట్లో సినీ అవకాశాల కోసం ఫ్రీగా నటించినవారు.. లేదా అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక మొత్తం భారత సినీ చరిత్రలోనే కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రికార్డ్ సృష్టించిన చిరంజీవి సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సమయంలో రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన సినిమాలు కూడా ఉన్నాయని తెలుసా.. అంతేకాదు బాలీవుడ్ బిగ్ బీ వంటి వారు కూడా కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు ఈ స్టేజ్ కు చేరుకున్నారు.   అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తమ పాపులారిటీని బట్టి హీరోలు సినిమాకు పారితోషికం విషయంలో డిమాండ్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలు వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ సంచలనం సృష్టించారు. టాలీవుడ్ లో బాహుబలి సినిమా తర్వాత వంద కోట్ల రెమ్యునరేషన్ క్లబ్ లో కి ప్రభాస్ చేరగా తాజాగా కోలీవుడ్లో విజయ్ దళపతి 100 కోట్లు తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టించాడు.

అయితే ఇలా వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి హీరో సల్మాన్ ఖాన్.  అయితే సల్లు భాయ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి 33 ఏళ్లలో వేల పారితోషకం నుంచి కోట్లు తీసుకునే స్టేజ్ కు చేరుకున్నారు.. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా.. అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్.. నటించిన మొదటి సినిమా ఏది..? ఆ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కండల సల్మాన్ ఖాన్ మొదటి సారి బీవీ హోతే హౌసీ మూవీతో బీ టౌన్ లో అడుగు పెట్టాడు. ఈ సినిమాలో సల్మాన్ నటించిన పాత్రకు అంత ప్రాధాన్యత కూడా ఉండదు.. పైగా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. భారీ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ కు రూ. 11 వేల రూపాయలను పారితోషికం కింద ఇచ్చారట.  సల్మాన్ ఖాన్ సినీ కెరీర్ ను ఓ రేంజ్ కు తీసుకుని వెళ్ళింది.. ‘మైనే ప్యార్ కియా’.. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కాసుల వర్షం కురిపించింది. దీంతో సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలల్లో హీరోగా, అతిధిపాత్రల్లో నటిస్తూనే.. బుల్లి తెరపై బిగ్ బాస్ షోకి హోస్ట్ గా అలరిస్తున్నాడు సల్మాన్ ఖాన్.  నటనని ఫాషన్ గా తీసుకుని సినీ పరిశ్రమలో అడుగు పెట్టడానికి పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్న యువత కి ఇలాంటి హీరోలు ఆదర్శం.

Also Read: Vidura Niti: కొందరు తాము చెప్పిందే రైట్ అంటూ వాదిస్తుంటారు.. అప్పుడు కోయిలలా ఉండాలని చెప్పిన..