Sampoornesh Babu: మంత్రి అనీల్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన హీరో సంపూర్ణేష్ బాబు.. ఏమన్నారంటే..

రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

Sampoornesh Babu: మంత్రి అనీల్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన హీరో సంపూర్ణేష్ బాబు.. ఏమన్నారంటే..
Sampoornesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 5:28 PM

Sampoornesh Babu: రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తీరుపై పవన్ చేసిన విమర్శలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.. ఆన్ లైన్ టికెట్ల విషయంలో  పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు.  పరిశ్రమలో ఎందరో ప్రముఖులు ఉండగా పవన్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారన్నారు. పవన్ కల్యాణ్ నటించినా సంపూర్ణేష్ బాబు నటించినా ఇద్దరి కష్టం ఒకేటేనన్నారు. ప్రజలకు జవాబుదారీ తనం ఉండేలా చేయడమే ప్రభుత్వ ఉధ్దేశమని అన్నారు అనిల్. పారదర్శకత కోసమే ఆన్ లైన్ పోర్టల్ తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. సినిమా ఖర్చులో నలుగురైదుగురు మాత్రమే లబ్ధిపొందడం సమంజసం కాదనే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు వివరించారు అనిల్.

పవన్ కళ్యాణ్‌తో తనను పోల్చి విమర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై తాజాగా హీరో సంపూర్ణేష్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. ”మంత్రి అనిల్ గారు.. మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం.. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో ఉన్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు” అంటూ సంపూర్ణేష్ బాబు రాసుకొచ్చారు.Sampoornesh

Sampoorneshమరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్‌లో చాలా బాగా మాట్లాడాడు.. నేను బాగా ఇష్టపడే వ్యక్తి పవన్.. వైరల్ అవుతున్న మహేష్ ఓల్డ్ ట్వీట్

R. Madhavan : రాకెట్రీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మాధవన్.. సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనట..

Natural Star Nani : సీఎం జగన్‌కు హీరో నాని రిక్వెస్ట్.. పవన్ కళ్యాణ్‌కు థాంక్స్..