తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న నాని.. లేకుంటేనా!

తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న నాని.. అంటే ఏదో యాక్సిడెంట్ అయ్యింది అనుకునేరు. కాదు.. ఓ సినిమా నుంచి.. అదేం సినిమా అని అనుకుంటున్నారా? విజయదేవర కొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్'..

తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న నాని.. లేకుంటేనా!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Mar 10, 2020 | 2:33 PM

తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు నాని. అంటే ఏదో యాక్సిడెంట్ అయ్యింది అనుకునేరు. కాదు.. ఓ సినిమా నుంచి.. అదే సినిమా అని అనుకుంటున్నారా? విజయదేవర కొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’.

ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ ఫ్రస్టేటర్ రైటర్ పాత్రలో కనిపించాడు. కాగా… ఇందులో నలుగురు హీరోయిన్లు నటించారు. ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, రాశీ ఖన్నా, ఇసబెల్లా హీరోయిన్స్‌గా అలరించారు. ఎంతో ఆర్భాటంగా రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ముందు ఈ స్టోరీని.. డైరెక్టర్ క్రాంతి మాధవ్.. నానికి వినిపించారట. నాని కూడా ఈ కథ విని బాగానే ఇంప్రెస్ అయ్యాడు. అంతే కాదు ఈ స్టోరీలో కొన్ని మార్పులు చేస్తే బావుంటుందని సలహాలు కూడా ఇచ్చాడట. అయితే కథలో మార్పులు చేయడానికి ఇష్టపడని క్రాంతి మాధవ్.. విజయ్ దేవరకొండకు వినిపించి ఓకే చేయించుకున్నాడు.

అయితే ఈ సినిమా ఫస్ట్ డేనే ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఒకవేళ కనుక ఈ సినిమా నాని చేసివుంటే నిజంగానే ప్రమాదంలో పడి వుండేవాడని ఫీలయ్యాడట. కాగా.. ప్రస్తుతం నాని హీరోగా నటించిన ‘వీ’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.