నాని, సుధీర్‌ల మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ''వీ''. చిత్రీకరణ పరంగా అన్ని పనులు పూర్తి చేసుకుని మార్చి 25వ తేదీన విడుదలకు సిద్ధమైన తరుణంలో కరోనా వైరస్ వచ్చి అడ్డుపడింది. దీంతో ఈ సినిమా రిలీజ్ అప్పటి..
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ”వీ”. చిత్రీకరణ పరంగా అన్ని పనులు పూర్తి చేసుకుని మార్చి 25వ తేదీన విడుదలకు సిద్ధమైన తరుణంలో కరోనా వైరస్ వచ్చి అడ్డుపడింది. దీంతో ఈ సినిమా రిలీజ్ అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా విడుదల కానున్నట్లు ఇటీవలే పలు వార్తలు వినిపించాయి. అయితే ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనే లేదని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం పాటలు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక మెల్లి మెల్లిగా థియేరట్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా వి చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘వీ’ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్‌గా విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు. నివేదా థామస్, అతిదీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కింది.
Read More:
తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కోవిడ్ పాజిటివ్
48 గంటలు అన్నీ బంద్.. పుట్టపర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్