హాట్‌ టాపిక్‌గా ప్రభాస్‌ రెమ్యునరేషన్‌!

హాట్‌ టాపిక్‌గా ప్రభాస్‌ రెమ్యునరేషన్‌!

ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తోన్న ప్రభాస్‌.. ఈ మూవీ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో నటించబోతున్న

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 08, 2020 | 2:22 PM

Prabhas remuneration for Nag Ashwin film: ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తోన్న ప్రభాస్‌.. ఈ మూవీ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో నటించబోతున్న విషయం తెలిసిందే. సైన్స్‌ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు గానూ ప్రభాస్‌కి భారీ రెమ్యునరేషన్ అందుతున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ మూవీ కోసం రెబల్‌ స్టార్‌ 70కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

మూవీ షూటింగ్‌కి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టే సినిమాలకు ప్రభాస్‌ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ మూవీ కోసం 70కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దక్షిణాది భాషల్లో ఈ మూవీ డబ్బింగ్ హక్కుల్లోనూ 50శాతం తీసుకోబోతున్నట్లు సమాచారం. అంటే ప్రభాస్‌కి ఇచ్చే రెమ్యునరేషన్‌తో ఓ మీడియం రేంజ్ సినిమాను తీయొచ్చునని కొందరు అంటున్నారు. ఇక ఈ సినిమాలో దీపికాకు రూ.18కోట్లు ఇస్తున్నట్లు టాక్‌. కాగా వైజయంతీ మూవీస్‌ ఈ మూవీని 400 కోట్లతో నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: ఖైదీలకు సెంట్రల్‌‌ జైలులోనే చికిత్స.. ప్రభుత్వం చర్యలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu