రానా పెళ్లికి హాజరుకానున్న చెర్రీ, శర్వా!
దగ్గుబాటి వారసుడు రానా ఇవాళ తన ప్రియురాలు మిహీకను పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. రాత్రి గం.8.45ని.లకు రామానాయుడు స్టూడియోలో వీరిద్దరి పెళ్లి జరగనుంది.
Rana Weds Miheeka: దగ్గుబాటి వారసుడు రానా ఇవాళ తన ప్రియురాలు మిహీకను పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. రాత్రి గం.8.45ని.లకు రామానాయుడు స్టూడియోలో వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల నుంచి 35 మంది మాత్రమే హాజరుకానున్నారు. అందులో టాలీవుడ్ నుంచి నాగ చైతన్య, సమంతలు ఉన్నారు. రానాకు చైతూ కజిన్ అవ్వడంతో ఈ వివాహానికి వారు స్పెషల్ అట్రాక్షన్‌గా మారనున్నారు. ఇక వీరితో పాటు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, శర్వానంద్‌లు రానా పెళ్లికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. రానాకు చెర్రీ, శర్వా చిన్నప్పటి స్నేహితులు కాగా.. వీరిద్దరు ఈ వివాహ వేడుకకు వెళ్లనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే మరోవైపు కరోనా నేపథ్యంలో రానా వివాహానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. స్టూడియోలోకి ప్రవేశించడానికి మై గేట్ యాప్ ద్వారా అనుమతిని ఇవ్వనున్నారు. లోపలికి వెళ్లడానికి థర్మల్ స్క్రినింగ్ తప్పనిసరి చేశారు. బంధువులు, సన్నిహితులకు వీఆర్ కిట్స్ ద్వారా పెళ్లి చూసేందుకు ఏర్పాట్లు చేశారు.
Read This Story Also: హాట్ టాపిక్‌గా ప్రభాస్ రెమ్యునరేషన్!