Karthika Deepam: మలయాళంలో కార్తీకదీపం సీరియల్ ముగింపునే తెలుగులో ఇస్తే.. వంటలక్క ఫ్యాన్స్ ఆదరిస్తారా..!
Karthika Deepam: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక దీపం. సాయంత్రం 7. 30 అయ్యిందంటే చాలు సామాన్యుల నుంచి..
Karthika Deepam: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది కార్తీక దీపం. సాయంత్రం 7. 30 అయ్యిందంటే చాలు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ టీవీల ముందు చేరుకుంటారు. అంతగా ఆకట్టుకుంది కార్తీక దీపం. వెయ్యి ఎపిసోడ్స్ పైగా ప్రసారం అవుతున్నా ఈరోజుకి ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో నటించిన వంటలక్క , డాక్టర్ బాబు, సౌందర్య, మోనిత, దగ్గరనుంచి పనిమనిషి ప్రియమణి వరకూ ఎంతో ఫేమస్. తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ కార్తీక దీపం మలయాళంలో వచ్చిన సీరియల్ కు రీమేక్ కావడం విశేషం. మలయాళంలో హిట్ అయిన ఈ సీరియల్ తెలుగు, తమిళ, కన్నడ ఇలా అన్ని భాషల్లోను రీమేక్ అయ్యింది.
మలయాళంలోని సీరియల్ కు తెలుగు లో వచ్చేసరికి చిన్న చిన్న మార్పులు చేశారు. తెలుగులో దీపకు సవతి తల్లి ఉంటె.. మలయాళంలో సవతి తండ్రి ఉంటాడు. మలయాళంలో దీప , డాక్టర్ బాబులకు ఒక కూతురు ఉంటుంది. తెలుగులో కవల పిల్లలని పెట్టారు. ఇక మలయాళంలో కార్తీక్ తమ్ముడు ఆదిత్య చనిపోతాడు. కార్తీక్ కి క్యాన్సర్ వచ్చి, విదేశాలకు వెళ్తాడు అదేసమయంలో గతం కోల్పోయిన దీప మళ్ళీ గుర్తుకి వచ్చి సౌందర్య దగ్గరకు వస్తుంది. ఇక దీప కూతురు కలెక్టర్ అవుతుంది. ఇది మలయాళంలో కార్తీక్ దీపం వెర్షన్ కు ముగింపు.
దీప ఆరోగ్యం … మోనిత ప్రెగ్నెంట్ అంటూ చూపిస్తూ.. సస్పెన్స్ తో తెలుగులో నడుస్తున్న ఈ సీరియల్ కి ముగింపు ఎలా ఉంటుందనే విషయంలో అందరికీ ఆసక్తి పెరిగింది. దీపకు ఇద్దరు కవల పిల్లలను చూపించారు. దీప కూతురు కలెక్టర్ అవుతుందా… కార్తీక్ ఇక ఎప్పటికి దీప మంచిది..మోనిత చేసిన కుట్ర ఇదంతా అని ఎప్పుడు తెలుసుకుంటాడు.. అసలు కార్తీక్ దీప బతికి ఉండగా కలుస్తాడా…! మోనిత మాయ నుంచి బయటపడతాడా..! వంటలక్క డాక్టర్ బాబు లు ఎప్పుడు సంతోషంగా ఉంటారా అని తెలుగు ఆడియన్స్ చూస్తున్నారు. మౌనిత బండారం బయటపడుతుందా.. దీప జబ్బుతో మరణిస్తుందా.. అసలు ఈ సీరియల్ ని తెలుగులో ఎలా మళ్లించి ముగిస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసలు మోనిత కుట్ర ఎప్పుడు బయటపడుతుంది.. ఎలా ముగుస్తుంది అనేది చూడాలి.
Also Read: నిరుద్యోగులు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 3