Guppedantha Manasu: దీపక్కను వెనక్కు నెట్టిన రిషిధార.. అగ్రస్థానంలో నిలిచిన ప్రేమకథ..
గత కొద్దిరోజులుగా కార్తీక దీపం సీరియల్‌కు గట్టిపోటి ఇస్తుంది ఈ సీరియల్. తాజాగా విడుదలైన టీఆర్పీ రిపోర్ట్‌లో యూప్లస్ఆర్ కేటగిరీలో ఈ సీరియల్ అగ్రస్థానంలో నిలిచింది.
బుల్లితెరపై కొన్ని సంవత్సరాలుగా అగ్రస్థానంలో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. గత ఆరేళ్లుగా టీఆర్పీ రేటింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సైతం ఈ సీరియల్‌తో పోటి పడలేకపోయింది. అంతేకాకుండా.. కార్తీక దీపం తర్వాత గుప్పెడంత మనసు (Guppedantha Manasu), ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్స్ నిలిచేవి. కానీ ఇప్పుడు పరిస్థతి పూర్తిగా మారిపోయింది. తాజాగా ప్రేక్షకులు ఎంతగానో ఆరాధించే దీపక్కను వెనక్కు నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది గుప్పెడంత మనసు సీరియల్. గత కొద్దిరోజులుగా కార్తీక దీపం సీరియల్‌కు గట్టిపోటి ఇస్తుంది ఈ సీరియల్. తాజాగా విడుదలైన టీఆర్పీ రిపోర్ట్‌లో యూప్లస్ఆర్ కేటగిరీలో ఈ సీరియల్ అగ్రస్థానంలో నిలిచింది.
కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవడానికి తెగ ట్రై చేస్తుంది. కొత్త జనరేషన్‌తో సీరియల్ స్టార్ట్ చేసిన ప్రయోజనం లేకపోవడంతో.. తిరిగి దీప, కార్తీక్, మోనితలను తీసుకువచ్చాడు డైరెక్టర్. అయితే క్యారెక్టర్స్ తిరిగి వచ్చినా.. మళ్లీ పాత కథే కావడంతో ఆడియన్స్ సైతం పెదవి విరుస్తున్నట్లుగా తెలుస్తోంది. మళ్లీ ఇద్దరు భార్యలు భర్త కోసం పోటీ పడడం కథలో కొత్తధనం లేకపోపవడంతో కార్తీక దీపం రేటింగ్ తగ్గినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రిషి, వసు ప్రేమకథ.. ఎమోషనల్ సీన్స్.. బుల్లితెర ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా.. కొద్ది రోజులుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఉదయం 6 గంటలకే అప్లోడ్ చేయాల్సిన గుప్పెడంత మనసు సీరియల్ ప్రసారం కాకపోవడంతో.. టీవీలోనే సీరియల్ ప్రియులు గుప్పెడంత మనసు కోసం చూస్తున్నారు. దీంతో ఈ సీరియల్ అగ్రస్థానంలో నిలిచినట్లుగా తెలుస్తోంది. రిషి, వసుధర కెమిస్ట్రీ యువతను.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక మూడవ స్థానంలో ఇంటింటి గృహలక్ష్మీ నిలవగా.. నాల్గవ స్థానంలో దేవత.. ఐదవ స్థానంలో జానకి కలగనలేదు సీరియల్స్ నిలిచాయి.