AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: శ్రీసత్య పై అర్జున్ కళ్యాణ్ ఫీలింగ్స్.. అసలు విషయం చెప్పేసిన శ్రీహాన్.. పాపం అన్నా అనేసిందిగా..

ఆమె ఏం మాట్లాడిన కరెక్ట్ అంటూ మద్దతిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. శ్రీసత్య పై అర్జున్‏కు ఫీలింగ్స్ ఉన్నాయంటూ అసలు విషయం చెప్పేశాడు శ్రీహాన్.

Bigg Boss 6 Telugu: శ్రీసత్య పై అర్జున్ కళ్యాణ్ ఫీలింగ్స్.. అసలు విషయం చెప్పేసిన శ్రీహాన్.. పాపం అన్నా అనేసిందిగా..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2022 | 5:06 PM

Share

బిగ్ బాస్ రియాల్టీ షోలో లవ్ ట్రాక్ ఉండడం కామన్. గత సీజన్లలో లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. వారిద్దరు ఫ్రెండ్స్ అయినా.. ఆడియన్స్‏కు ప్రేమికులుగా చూపించడంలో బిగ్ బాస్ మేకర్స్ దిట్ట. ఇక ఇప్పుడు సీజన్ 6 ప్రారంభమై (Bigg Boss 6 Telugu) మూడు వారాలు గడుస్తుంది. కానీ ఇప్పటికీ హౌస్‏లో లవ్ ట్రాక్ మొదలు కాలేదు. దీంతో ఇప్పటికే పలువురు ఇంటి సభ్యుల మధ్య రొమాంటిక్ ట్రాక్ వేసేందుకు తెగ ట్రై చేస్తున్నారు బిగ్ బాస్. శని, ఆదివారాల్లో ఈ రచ్చ మరింత ఎక్కువవుతుంది. ఇప్పటికే ఓ జంటను చూపిస్తున్న బిగ్ బాస్.. ఇప్పుడు మరో జోడిని సిద్ధం చేస్తున్నారు. మొదటి నుంచి శ్రీసత్య అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్న అర్జున్ కళ్యాణ్.. ఆమె ప్రతి మాటకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఏం మాట్లాడిన కరెక్ట్ అంటూ మద్దతిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. శ్రీసత్య పై అర్జున్‏కు ఫీలింగ్స్ ఉన్నాయంటూ అసలు విషయం చెప్పేశాడు శ్రీహాన్.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. మెరీనా, నేహ మధ్య మాటల యుద్ధం నడిచింది. అలాగే.. తన బొమ్మలు దొంగిలించడంలో రేవంత్ తెగ ఫీల్ అవుతున్నాడు. దీంతో సుదీప నచ్చచెప్పేందుకు ట్రై చేయగా.. వద్దంటూ వెళ్లిపోయాడు. ఇక శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, రేవంత్ మధ్య సంభాషణ జరుగుతుండగా.. తాను ఇంట్లో ఉన్న వాళ్లందరిని అన్నా అని పిలుస్తానని చెప్పడంతో వావ్.. సూపర్ అని అనేసాడు. ఇక వీరిద్దరి గురించి మరోచోట నేహ, శ్రీహాన్ ముచ్చట్లు పెట్టారు. వారిద్దరి గురించి తనకు ఏం అర్థం కావడం లేదని.. శ్రీ సత్య ఏం చెప్పినా..వావ్ సూపర్ అనేస్తున్నాడని నేహ అనగా.. ఆమెపై అర్జున్ కళ్యాణ్ కు ఫీలింగ్స్ ఉన్నాయంటూ అసలు విషయం చెప్పేశాడు శ్రీహాన్. ఇక తాజా ప్రోమో నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
PF ఖాతా బ్లాక్ అయిందా? ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేసుకోండి
PF ఖాతా బ్లాక్ అయిందా? ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేసుకోండి
ఆదిలాబాద్ లో కన్నుల పండుగగా ఆరట్టు ఉత్సవం
ఆదిలాబాద్ లో కన్నుల పండుగగా ఆరట్టు ఉత్సవం
డీలిమిటేషన్‌పై ఢీ అండే ఢీ.. దేశ రాజకీయాల్లో కీలక పరిణామం
డీలిమిటేషన్‌పై ఢీ అండే ఢీ.. దేశ రాజకీయాల్లో కీలక పరిణామం
మూడేళ్లుగా మూగబోయిన గొంతు.. నాలుగు రోజుల్లోనే మళ్లీ మాట్లాడేలా
మూడేళ్లుగా మూగబోయిన గొంతు.. నాలుగు రోజుల్లోనే మళ్లీ మాట్లాడేలా
చలికి కరివేపాకు మొక్క వాడిపోతోందా.. ఈ 5 టిప్స్‌ పాటిస్తే
చలికి కరివేపాకు మొక్క వాడిపోతోందా.. ఈ 5 టిప్స్‌ పాటిస్తే
బెండకాయలు ఉన్నాయా? ఈసారి ఇలా వేపుడు చేయండి.. రుచి అదిరిపోద్ది!
బెండకాయలు ఉన్నాయా? ఈసారి ఇలా వేపుడు చేయండి.. రుచి అదిరిపోద్ది!
భారీగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన స్టార్స్ వీళ్లే..
భారీగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన స్టార్స్ వీళ్లే..
ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..?
ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..?
మెనోపాజ్ తర్వాత మహిళలు పాలు తాగితే ఏమవుతుంది? అధ్యయనంలో నిజాలివే!
మెనోపాజ్ తర్వాత మహిళలు పాలు తాగితే ఏమవుతుంది? అధ్యయనంలో నిజాలివే!
ఏపీలో ఓటర్లకు అలర్ట్.. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా తెలుసుకోండి
ఏపీలో ఓటర్లకు అలర్ట్.. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా తెలుసుకోండి