Tollywood: ఈ హైదరాబాదీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? 50 ఏళ్లు దాటినా అందంలో అప్పరసే.. ఇప్పటికీ సింగిల్ గానే..
ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్. చిన్నతనంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈ అందాల తార ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది..
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. మహా అయితే ఒక పదేళ్లు సినిమాలు చేస్తారు. ఇంకాస్త ఎక్కువ అంటే ఓ 15 ఏళ్లు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు అంటూ సినిమా కెరీర్ కు కామానో, ఫుల్ స్టాప్ నో పెడతారు. అయితే పై ఫొటోలో ఉన్న హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్. ఆమె ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోంది. 1985లో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన బ్యూటీ ఇప్పటికీ సినిమాలు చేస్తోంది. అది కూడా హీరోయిన్ గానే. ఓ పక్క గ్లామరస్ రోల్స్ పోషిస్తూనే మరో వైపు కథా ప్రాధాన్యమున్న లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడామె వయసు సుమారు 52 ఏళ్లు. ఇప్పటికీ సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోందీ సొగసరి. అయితే ఇటీవల ఈ సీనియర్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి 52 ఏళ్ల వయసులోనూ అందంలో అప్పరసలా మెరుస్తోన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది. యస్.. ఈ బ్యూటీ మరెవరో కాదు టబు. సోమవారం (నవంబర్ 04) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు,అభిమానులు, నెటిజన్లు ఈ సీనియర్ హీరోయిన్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో టబుకు సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన టబు ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తోంది. గతంలో ఆమె పలు తెలుగు సినిమాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు చేసింది. ముఖ్యంగా నాగార్జున- టబుది సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ జోడీగా గుర్తింపు తెచ్చుకుంది. కూలీ నెంబర్ 1, ప్రేమదేశం, నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి, ఆవిడా మా ఆవిడే, అందరివాడు, పాండురంగడు, ఇదీ సంగతి తదితర తెలుగు సినిమాల్లో నటించింది టబు. ఆ మధ్యన అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ తల్లిగానూ మెప్పించింది. ఇటీవలి బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన క్రూ సినిమాలోనూ హాట్ గా కనిపించి ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది.
Guess The Tollywood Actress In This Photo, She Is Crew Movie Fame Tabu Birthday Special
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.