కొంద‌రు ‘అన్న‌య్య’ అంటే భ‌యంతోనే, ఆయ‌న‌ అభ‌యం కోస‌మో విరాళాలు…

కొంద‌రు 'అన్న‌య్య' అంటే భ‌యంతోనే, ఆయ‌న‌ అభ‌యం కోస‌మో విరాళాలు...

కొణిదెల శివ శంక‌ర వ‌ర ప్ర‌సాద్..అలియాస్ చిరంజీవి. తెలుగు సినీ జ‌గ‌త్తుపై తిరుగులేని మ‌హారాజు. అన్న ఎన్టీఆర్ త‌ర్వాత టాలీవుడ్ సింహాస‌నాన్ని ఏక‌చ‌త్ర‌ధిప‌త్యంగా ఏలాడు చిరు. ఇండ‌స్ట్రీలో అంద‌రూ ఆయ‌న్ని అన్న‌య్య అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. సాధారాణ పోలీసు కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి…సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా..ఇప్పుడు ఇండ‌స్ట్రీ పెద్ద‌న్న‌గా జేజేలు అందుకుంటున్నారు. అంతేకాదు త‌న కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీకి ఎంద‌రో స్టార్ల‌ని అందించాడు. త‌న‌కు ఇంత దూరం తీసుకొచ్చిన ఇండ‌స్ట్రీ క‌ష్టాల్లో ఉన్న‌ […]

Ram Naramaneni

|

Apr 11, 2020 | 6:49 PM

కొణిదెల శివ శంక‌ర వ‌ర ప్ర‌సాద్..అలియాస్ చిరంజీవి. తెలుగు సినీ జ‌గ‌త్తుపై తిరుగులేని మ‌హారాజు. అన్న ఎన్టీఆర్ త‌ర్వాత టాలీవుడ్ సింహాస‌నాన్ని ఏక‌చ‌త్ర‌ధిప‌త్యంగా ఏలాడు చిరు. ఇండ‌స్ట్రీలో అంద‌రూ ఆయ‌న్ని అన్న‌య్య అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. సాధారాణ పోలీసు కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి…సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా..ఇప్పుడు ఇండ‌స్ట్రీ పెద్ద‌న్న‌గా జేజేలు అందుకుంటున్నారు. అంతేకాదు త‌న కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీకి ఎంద‌రో స్టార్ల‌ని అందించాడు. త‌న‌కు ఇంత దూరం తీసుకొచ్చిన ఇండ‌స్ట్రీ క‌ష్టాల్లో ఉన్న‌ ప్ర‌తీసారి చిరంజీవి స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా క‌రోనా విరుచుకుపడ‌టంతో స్వ‌త‌హాగా తెలుగు రాష్ట్రాల‌కు భారీ విరాళం అందించిన చిరంజీవి… తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని కార్మిక వర్గాల శ్రేయ‌స్సు కోసం నడుం బిగించారు. డైలీ కూలీపై ఆధార‌ప‌డేవారికి సాయం చేయ‌డం కోసం.. కరోనా క్రైసిస్ చారిటీ స్థాపించి..సినీ ప్ర‌ముఖుల‌ను విరాళాలు చేయాల్సిందిగా కోరారు. ఇంత గొప్ప కార్య‌క్ర‌మం చేప‌ట్టిన మెగాస్టార్ కి ఎన్నో ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. విరాళాలు కూడా భారీగానే వ‌చ్చాయి.

అయితే కొంద‌రు ప్ర‌ముఖులు మాత్రం చిరు స్థాపించిన చారిటీకి విరాళాలు ఇవ్వ‌డానికి తెగ ఇబ్బందిప‌డుతోన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రికొంద‌రు చిరంజీవి అభ‌యం కోస‌మో, ఆయ‌నంటే భ‌యంతోనే కొద్దో, గొప్పో విరాళాలు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సమాచారం. సంపాదించిందంతా విరాళంగా ఇస్తున్న‌ట్టు తెగ ఫీల‌వుతున్నారు కొంద‌రు. టికెట్ తెగితే క‌దా..ఈ రోజు వారు ఈ స్థాయిలో ఉంది. రోజూ మీ చుట్టూ తిరిగే..వెండితెర‌పై వెలుగొంద‌డానికి స‌హాయ‌ప‌డితే కార్మికులు పొట్టనింపడానికి కొద్దో, గొప్పో స‌హాయం చేస్తో ఏం పోతుంది. ‘అన్న‌య్య’ ఇంత గొప్ప కార్య‌క్రమానికి శ్రీకారం చుడితే, సంతోషంగా.. స్వ‌చ్చందంగా విరాళాలు ఇవ్వాల్సింది పోయి..న‌లుగురు ఏమైనా అనుకుంటార‌నో, మీడియా ఏకేస్తుంద‌నో..లేటుగా వ‌చ్చి కొద్ది అమౌంట్ ఇచ్చి మ‌మః అనిపించేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కూడా మీకు అర్థం కావ‌డం లేద‌నుకుంటా…మ‌నుషులు శాశ్వ‌తం కాదు.. చేసిన సాయం, మంచి మాత్ర‌మే శాశ్వ‌తం అని.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu